IPL 2025: ఎవర్రా సామీ.. 2 రోజుల్లో 2 టీంలతో బరిలోకి.. ముంబై ఇండియన్స్ కొత్త కరోడ్‌పతి ట్యాలెంట్ చూస్తే షాకే
U19 Asia Cup and Abu Dhabi t10 League: ఐపీఎల్ వేలంలో రూ. 4.80 కోట్లకు అమ్ముడుపోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన 18 ఏళ్ల ఆఫ్ఘన్ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్.. టోర్నమెంట్ మధ్యలో మరో మ్యాచ్ ఆడేందుకు వెళ్లడంతో సంచలనంగా మారాడు. అసలు ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Mumbai Indians: ఇది క్రికెట్‌లో టీ20, టీ10 లీగ్‌ల యుగం. ప్రపంచంలోని ప్రతి మూలలో అనేక విభిన్న ఫ్రాంచైజీ లీగ్‌లు ప్రారంభమయ్యాయి. దీని ప్రభావం అంతర్జాతీయ క్రికెటర్లు నిరంతరం బిజీగా ఉంటున్నారు. కొంతమంది లీగ్‌లు ఆడుతుంటే.. మరికొందరు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. అయితే, ఓ రోజు ఒక టోర్నమెంట్‌లో, మరుసటి రోజు మరో లీగ్‌లో ఆడుతున్న ప్లేయర్‌ను చూశారా? అఫ్గానిస్థాన్ యువ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ చేసిన పనితో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
కేవలం 18 సంవత్సరాల వయస్సులో, యువ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్, అతని సీనియర్ రషీద్ ఖాన్, భాగస్వామి నూర్ అహ్మద్‌లతో కలిసి ఆడుతున్నాడు. దీంతో చిన్న వయస్సులోనే ప్రపంచ క్రికెట్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని వారాల క్రితం, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌ను బెంబేలెత్తించిన ఈ కుర్రాడు.. బంగ్లాదేశ్ జట్టును కూడా ఇబ్బందుల్లోకి నెట్టేశాడు. ఇటువంటి పరిస్థితిలో ఈ ఆఫ్ఘాన్ బౌలర్‌కు డిమాండ్ కూడా పెరగడం ప్రారంభించింది. తాజాగా ఈ ఆఫ్గాన్ ప్లేయర్ ఒక టోర్నమెంట్ నుంచి మరొక టోర్నమెంట్‌కు మారవలసి వచ్చింది.
రెండు రోజుల్లో 2 వేర్వేరు టీమ్‌లు..
ప్రస్తుతం అండర్-19 ఆసియా కప్ టోర్నమెంట్ యూఏఈలో జరుగుతోంది. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ తరపున ఘజన్‌ఫర్ ఆడుతున్నాడు ఎందుకంటే అతని వయస్సు ఇంకా 18 ఏళ్లు మాత్రమే. నవంబర్ 29 శుక్రవారం, అతను కూడా తన దేశం కోసం ఆడటానికి వచ్చాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్థాన్ తలపడింది. ఘజన్‌ఫర్ పటిష్ట ప్రదర్శన చేసి 10 ఓవర్లలో 25 పరుగులిచ్చి 1 వికెట్ కూడా తీశాడు.
ఆ తర్వాత శనివారం, నవంబర్ 30, అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో ఈ యువ స్పిన్నర్‌ను చూసి అందరూ షాక్ అయ్యారు. అబుదాబి టీ10 లీగ్‌లో పాల్గొనేందుకు ఘజన్‌ఫర్ ఇక్కడికి వచ్చాడు. అందులో అతను టీమ్ అబుదాబిలో భాగమై నార్తర్న్ వారియర్స్‌తో తలపడుతున్నాడు. రెండు రోజుల్లో రెండు వేర్వేరు జట్లకు ఆడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ, అతని ఆటతీరు చూసి ఎవరూ ఆశ్చర్యపోలేదు. దాదాపు 6 అడుగుల 2 అంగుళాల పొడవున్న స్పిన్నర్ 2 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే వెచ్చించి 1 వికెట్ తీశాడు.
టోర్నీ మధ్యలో టీ10 లీగ్..
అయితే, రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడడం పెద్ద విషయం కాదు. రెండు వేర్వేరు టోర్నమెంట్లలో పాల్గొనడం వంటి సంఘటనలు కూడా ఇంతకు ముందు చాలా అరుదుగా జరిగాయి. అయితే ఒక టోర్నీ మధ్యలో మరో టోర్నీ ఆడబోతుండడం కచ్చితంగా షాకింగ్‌గా మారింది. ఇప్పుడు మరోసారి అతను అండర్-19 ఆసియా కప్‌లో తిరిగి రానున్నాడు. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ డిసెంబర్ 1 ఆదివారం శ్రీలంకతో తలపడుతుంది.
ముంబై ఇండియన్స్ కోటీశ్వరుడు..
IPL 2025 మెగా వేలంలోఈ ఆఫ్ఘాన్ ప్లేయర్‌కు బలమైన బిడ్ వచ్చింది. దీంతో ఈ ఘజన్‌ఫర్ ఇటీవల వెలుగులోకి వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ వంటి జట్ల మధ్య అతనికి గట్టి పోటీ ఉంది. చివరికి 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై అతనిని రూ. 4.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఘజన్‌ఫర్‌కి ఇది తొలి ఐపీఎల్ సీజన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..