MS Dhoni: తనను రిటైన్ చేసుకుని డబ్బు వృథా చేసుకొవద్దని చెప్పాడటా..

ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐపీఎల్ 2021 ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. మూడు సంవత్సరాల తర్వాత ఆ జట్టు టైటిల్ గెలుచుకుంది.

MS Dhoni: తనను రిటైన్ చేసుకుని డబ్బు వృథా చేసుకొవద్దని చెప్పాడటా..
Dhoni
Follow us
Srinivas Chekkilla

| Edited By: Ravi Kiran

Updated on: Nov 01, 2021 | 9:08 PM

ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐపీఎల్ 2021 ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. మూడు సంవత్సరాల తర్వాత ఆ జట్టు టైటిల్ గెలుచుకుంది. ఆటను మెరుగుపరుచుకోవడం ద్వారా వారు టోర్నిలో దూసుకెళ్లారు. మొదటగా ప్లేఆఫ్‌కు అర్హత సాధించారు. ఆ తర్వాత ఫైనల్‌కు చేరుకున్నారు. దీనంతటికి కారణం కెప్టెన్ ధోనీ.. అందుకే ఆ జట్టుకు మొదటి నుంచి కెప్టెన్‎గా వ్యవహరిస్తున్నాడు. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్‎లో మెగా వేలం ఉండనుంది. నిబంధనల ప్రకారం ఒక ఫ్రాంఛైజీ నలుగురు ఆటగాళ్లను మాత్రమే తిరిగి తీసుకునేందుకు అవకాశం ఉంది.

ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్‌కి ముందు CSK మొదటి ఎంపిక ఆటగాడిగా అవుతాడనడంలో సందేహం లేదు. అయితే తనను నిలబెట్టుకోవడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి వస్తుందని ధోనీ చెప్పాడని ఫ్రాంఛైజీ యజమాని ఎన్. శ్రీనివాసన్ చెప్పాడు. తదుపరి ఐపీఎల్‌లో ధోనీ ఆడతాడా లేదా అనే దానిపై శ్రీనివాసన్ నేరుగా సమాధానం ఇవ్వలేదు.

“MS ధోని ఒక న్యాయమైన వ్యక్తి, అతను రిటెన్షన్ పాలసీ రావాలని కోరుకుంటున్నాడు, ఎందుకంటే అతనిని రిటైన్ చేసేటప్పుడు CSK చాలా డబ్బును కోల్పోవాలని అతను కోరుకోలేదు – అందుకే అతను ప్రతి ఒక్కరికీ భిన్నమైన సమాధానం ఇస్తాడు” అని శ్రీనివాసన్ చెప్పాడు. “చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ మరింతగా ఆడాలని కోరుకుంటున్నాను. ధోనీ నన్ను చాలా గౌరవిస్తాడు. నేను అతనికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను.” అని అన్నారు.

ఒక ఫ్రాంఛైజీ తన ఫస్ట్ ఛాయిస్ ప్లేయర్‌లో నలుగురు ప్లేయర్‌లను రిటైన్ చేసుకుంటే రూ. 16 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే ఆ మొత్తం రూ.15 కోట్లకు తగ్గుతుంది. ఒక ఫ్రాంచైజీ 1 లేదా 2 ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ.14 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. CSK 3-4 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటుందని తెలుస్తోంది. ధోని రిటైర్‌మెంట్‌పై ఎలాంటి సూచనా చేయలేదు. ఎల్లో ఆర్మీ కోసం కనీసం మరో సీజన్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ధోనీ రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ, అతను ఏదో ఒక హోదాలో CSKతో కొనసాగాలని భావిస్తున్నారు.

Read Also.. T20 World Cup 2021: భారత్ ఓటమిపై మాజీ క్రికెటర్ల ఆగ్రహం.. ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారంటూ ట్వీట్లు..

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై