Dhoni Muscle Tear: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 122 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. కానీ, 16వ ఓవర్ ముగిసే సమయానికి ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేసేందుకు క్రీజులోకి వస్తాడని అంతా భావించారు. కానీ, అలా జరగకపోవడంతో అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ వచ్చాడు. కానీ, శార్దూల్ అద్భుతాలు చేయలేకపోయాడు. ఇటువంటి పరిస్థితిలో ఎంఎస్ ధోని 9వ నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే, ఖాతా తెరవకుండానే తొలి బంతికే ధోని ఔట్ కాగా, హర్షల్ పటేల్ అతడిని క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ పంపాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా ధోని 9వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడని విమర్శించాడు. అతను తన జట్టును నిరాశపరిచాడు. కాబట్టి అతను అలా చేయకూడదంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ధోనీ మొదట బ్యాటింగ్ చేయలేకపోతే జట్టు నుంచి తప్పుకోవాలి లేదా వేరే బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు.
అయితే, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్‌లో కీలక విషయం బయటపడింది. ధోనీకి కండరాలు పట్టేశాయని, అందుకే అతను వేగంగా పరుగెత్తలేడని ఈ నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభంలోనే ఇలా జరిగింది. అయితే, డెవాన్ కాన్వే నిష్క్రమించిన తర్వాత కూడా ధోనీకి ఎలాంటి ఆప్షన్ లేకుండా పోయింది. అందుకే ధోనీ ఎట్టకేలకు వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌కు దిగుతున్నాడు.
ధోనీ చాలా బాధతో ఆడుతున్నాడు. రన్నింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మైదానంలో మెడిసిన్స్ తీసుకుంటున్నాడు. వైద్యులు ధోనీని ఆడోద్దని సూచించారు. కానీ ధోనికి వేరే మార్గం లేదు. ఎందుకంటే జట్టులోని చాలా మంది ఆటగాళ్లు గాయపడ్డారు. మేం మా B టీమ్‌తో ఆడుతున్నాం అంటూ ఇంతకుముందే ప్రకటించారు. ధోనీ గాయం గురించి తెలియని వారు ఇలా మాట్లాడుతున్నారు. కానీ అతను తన టీమ్ కోసం ఇలా చేస్తున్నాడు అంటూ ఫ్యా్న్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గత సీజన్‌లో కూడా ధోనీ మోకాలి గాయంతో ఆడాడు. ఆ తర్వాత అతనికి శస్త్రచికిత్స జరిగింది. ధోనీ గాయం నయమైనప్పటికీ, ఇప్పుడు కండరాలు చిట్లడం అతడిని ఇబ్బంది పెడుతోంది. ధోనీ వయస్సు 42 సంవత్సరాలు. మొత్తం 20 ఓవర్లపాటు మైదానంలో ఉంటున్నాడు. ధోనీ పరుగులు తీయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, అతను తన జట్టును విడిచిపెట్టడం లేదు.
రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో అద్భుతాలు చేస్తున్నాడని కూడా ఆ పరిశోధనలో తెలిపారు. మైదానంలో ధోనీ అతనికి మార్గనిర్దేశం చేస్తున్నాడు. ఒకవేళ జట్టు ప్లేఆఫ్‌కు చేరకపోతే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించరు. ప్లేఆఫ్స్ దాటి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆ మూలం తెలిపింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..