IND vs PAK: ఆ క్షణం కోసమే ఎదురుచూస్తున్నా.. ఆమెను కలిశాకే పాక్ పని పడతా: బుమ్రా ఎమోషనల్ స్టేట్‌మెంట్..
Jasprit Bumrah: ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బుధవారం జరిగిన ప్రపంచకప్ 2023లో 9వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 10 ఓవర్లలో 39 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు . అంతకుముందు ఆస్ట్రేలియాపై కూడా రెండు వికెట్లు తీశాడు. పాకిస్థాన్‌పై కూడా బుమ్రా తన అద్భుతమైన ఫాంను కొనసాగించాలనుకుంటున్నాడు.

Jasprit Bumrah: బుమ్రా తన స్వస్థలం అహ్మదాబాద్‌లో 1,32,000 మంది అభిమానుల సమక్షంలో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ శనివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు తన తల్లిని కలుసుకోబోతున్నట్లు వెల్లడించాడు.
29 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా ఆఫ్ఘనిస్తాన్‌పై తన అద్భుతమైన ప్రదర్శన తర్వాత మాట్లాడుతూ, “నేను కొంతకాలంగా ఇంటికి దూరంగా ఉన్నాను. మా ఇంట్లో అమ్మను చూసేందుకు ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. బుమ్రాకు 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఆ తరువాత, బుమ్రాను అతని తల్లి దల్జీత్ చూసుకుంది. ఆమె వృత్తిరీత్యా స్కూల్ ప్రిన్సిపాల్‌గా పనిచేసేది.
‘నేను వెళ్లి అమ్మను కలుస్తాను. ఇది నాకు అత్యంత ముఖ్యమైనది. నేను అహ్మదాబాద్‌లో ఇంతవరకు వన్డే ఆడలేదు. కానీ, అహ్మదాబాద్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాను. ఇక్కడి వాతావరణం అద్భుతంగా ఉండబోతోంది. మ్యాచ్ చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తారన్న నమ్మకం ఉంది. కాబట్టి ఇక్కడ మ్యాచ్ అద్భుతంగా సాగుతుంది. నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని ఆశిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
అద్భుతమైన ఫామ్‌లో బుమ్రా..
ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బుధవారం జరిగిన ప్రపంచకప్ 2023లో 9వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 10 ఓవర్లలో 39 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు . అంతకుముందు ఆస్ట్రేలియాపై కూడా రెండు వికెట్లు తీశాడు. పాకిస్థాన్‌పై కూడా బుమ్రా తన అద్భుతమైన ఫాంను కొనసాగించాలనుకుంటున్నాడు.
ఇరు జట్ల స్వ్కాడ్స్:
View this post on Instagram
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్ , సూర్యకుమార్ యాదవ్.
పాకిస్థాన్ జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







