T20Is Record: టీ20లో ఎక్కువ సార్లు డకౌట్లు అయిన స్టార్ ప్లేయర్లు వీళ్లే.. ఈ రికార్డుల్లో కూడా మనోళ్లు తోపులు
టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఎప్పుడూ దూకుడుగా ఆడుతూ పరుగులు సాధిస్తారు. అయితే, కొందరు ఆటగాళ్లు మాత్రం పరుగులేమీ చేయకుండానే (డకౌట్) అవుట్ అయ్యి, ఈ అవాంఛిత జాబితాలో చేరారు. అసలు 'డకౌట్' అంటే ఒక్క పరుగు కూడా చేయకుండా అవుట్ కావడమే. ఇది ఏ బ్యాట్స్‌మెన్‌కైనా చాలా ఇబ్బందికరమైన విషయం.

T20Is Record: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ధనాధన్ పరుగులు చేస్తూ అలరిస్తుంటారు. అయితే, కొందరు ఆటగాళ్లు మాత్రం సున్నా పరుగులకే వెనుదిరిగి, ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. అసలు డకౌట్ అంటే ఒక్క పరుగు కూడా చేయకుండా అవుట్ కావడమే, ఇది ఏ బ్యాట్స్‌మెన్‌కైనా చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ వార్తలో టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.
డకౌట్ల జాబితాలో టాప్‌లో ముగ్గురు రువాండా ప్లేయర్లు ఉన్నారు. రువాండాకు చెందిన కెవిన్ ఇరాకోజ్ 75 టీ20 మ్యాచ్‌లలో 56 ఇన్నింగ్స్‌లు ఆడి, ఏకంగా 13 సార్లు సున్నా పరుగులకే అవుటయ్యాడు. అతని బ్యాటింగ్ సగటు కేవలం 10.17 మాత్రమే. అలాగేఅతని సహచర ఆటగాడు జాపి బిమెనిమనా కూడా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఇతను 91 మ్యాచ్‌లలో 327 పరుగులు చేసినప్పటికీ, 13 సార్లు డకౌట్ అయ్యాడు.మార్టిన్ అకాయేజు 95 టీ20 మ్యాచ్‌లలో 590 పరుగులు చేసినప్పటికీ, ఇతను కూడా 13 సార్లు సున్నాకే పెవిలియన్ చేరాడు.
టీ20 క్రికెట్‌లో చిన్న దేశాల ఆటగాళ్లతో పాటు, అంతర్జాతీయ స్థాయిలోని అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ సౌమ్య సర్కార్ 87 టీ20 మ్యాచ్‌లలో 13 సార్లు డకౌట్ అయ్యాడు. అతను తన కెరీర్‌లో ఇప్పటివరకు 1462 పరుగులు చేసినప్పటికీ, అతని నిలకడ లేని ఫామ్ కారణంగా ఈ జాబితాలో చేరిపోయాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ దసున్ షనక పేరు కూడా ఈ జాబితాలో ఉంది. అతను 105 మ్యాచ్‌లలో 1511 పరుగులు చేసినప్పటికీ, 13 సార్లు డకౌట్ అయ్యాడు. షనక ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు.
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, ఇటీవల టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. అతను కూడా ఈ జాబితాలో భాగమే. అయితే, రోహిత్ శర్మ ఈ జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు. తన కెరీర్‌లో మొత్తం 159 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్, 151 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 4231 పరుగులు చేశాడు. అతని పేరిట 5 సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు ఉన్నప్పటికీ, అతను 12 సార్లు సున్నా పరుగులకే అవుటయ్యాడు. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ డకౌట్ల జాబితాలో చేరడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే, అతని భారీ పరుగులు, సెంచరీల రికార్డును బట్టి చూస్తే ఇది ఒక చిన్న ప్రతికూలత మాత్రమే అని చెప్పొచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




