IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్.. రికార్డులకు పిచ్చెక్కిస్తోన్న సిరాజ్ మియా

Mohammed Siraj: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వికెట్ పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

IPL 2025: ఐపీఎల్ 2025లో నంబర్ వన్ బౌలర్‌గా డీఎస్పీ సాబ్.. రికార్డులకు పిచ్చెక్కిస్తోన్న సిరాజ్ మియా
Siraj (1)

Updated on: Apr 10, 2025 | 6:45 AM

Mohammed Siraj: ఐపీఎల్ (IPL) 2025లో మహమ్మద్ సిరాజ్ రీ ఎంట్రీ ఇచ్చిన తీరు నిజంగా ప్రశంసనీయం. సిరాజ్‌ను టీం ఇండియా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ ఐపీఎల్ సీజన్‌లో అతను సంచలనం సృష్టించాడు. ఆర్‌సీబీని వదిలి గుజరాత్ టైటాన్స్ జట్టులో చేరిన సిరాజ్ ఈసారి అద్భుతమైన ఫాంలో కనిపిస్తున్నాడు. వికెట్లు తీయాలనే అతని దాహం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. ఈ సీజన్‌లో 5 మ్యాచ్‌ల్లో పవర్ ప్లేలో 7 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ విజయంలో సిరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరసేన సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను కేవలం 17 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.

పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్ల విధ్వంసం..

ఈ సీజన్‌లో, పవర్ ప్లేలో ఫాస్ట్ బౌలర్లు బ్యాట్స్‌మెన్‌పై విధ్వంసం సృష్టించారు. మహ్మద్ సిరాజ్ కాకుండా, చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన ఖలీల్ అహ్మద్ 5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా, లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన శార్దూల్ ఠాకూర్ కూడా అదే సంఖ్యలో మ్యాచ్‌ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 3 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు, ఆర్‌సీబీ ఆటగాడు జోష్ హేజిల్‌వుడ్ 4 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ షమీ 5 మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టారు.

ఐపీఎల్‌లో 100 వికెట్లు పూర్తి చేసిన సిరాజ్..

హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ తన 100వ ఐపీఎల్ వికెట్ ను పడగొట్టాడు. ఈ సీజన్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన వెనుక అతని కృషి ఎంతోదాగి ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అతను జట్టులోకి ఎంపిక కాలేదు. దీనితో అతను కాస్త బాధపడ్డాడు. కానీ, అతను ఆశ వదులుకోలేదు. అద్భుతంగా పునరాగమనం చేశాడు. గత సంవత్సరం వరకు భారత వన్డే జట్టులో మహమ్మద్ సిరాజ్ ఒక కీలక సభ్యుడిగా ఉన్నాడు. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో అతనికి స్థానం లభించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో, టీం ఇండియా స్పిన్ బౌలర్లపై ఎక్కువగా ఆధారపడింది. జట్టులో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, మహమ్మద్ షమీ, హర్షిత్ రాణాను మాత్రమే చేర్చింది.

షమీ అన్ని మ్యాచ్‌లు ఆడగా, హర్షిత్‌కు రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించింది. కొన్ని రోజుల క్రితం, జట్టులో ఎంపిక చేయకపోవడం కాస్త నిరాశపరిచిందని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఈ క్లిష్ట సమయంలో తన కుటుంబం, స్నేహితులు తనకు చాలా మద్దతు ఇచ్చారని కూడా ఆయన చెప్పుకొచ్చాడు. ఈ మద్దతు కారణంగానే అతను బాగా రాణించగలిగాడు. ఐపీఎల్ 2025లో సిరాజ్ గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. అతను 5 మ్యాచ్‌ల్లో 15.00 సగటు, 7.89 ఎకానమీ రేటుతో 10 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..