AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Siraj : కపిల్ దేవ్ తర్వాత మనోడే.. 34ఏళ్ల తర్వాత భారత క్రికెట్‎లో సిరాజ్ అరుదైన ఘటన

మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. గత 34 ఏళ్లలో ఏ భారత ఫాస్ట్ బౌలర్ కూడా సాధించని ఘనతను అతను సొంతం చేసుకున్నాడు. ఒక సంవత్సరంలో ఆడిన రెండు టెస్ట్ సిరీస్‌లలో 150 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు వేసిన తొలి భారత ఫాస్ట్ బౌలర్‌గా నిలిచాడు.

Mohammed Siraj : కపిల్ దేవ్ తర్వాత మనోడే.. 34ఏళ్ల తర్వాత భారత క్రికెట్‎లో సిరాజ్ అరుదైన ఘటన
Mohammed Siraj
Rakesh
|

Updated on: Aug 02, 2025 | 9:34 AM

Share

Mohammed Siraj : మహ్మద్ సిరాజ్ అంటే తెలయని వాళ్లు లేరు. ప్రస్తుతం తనను కపిల్ దేవ్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే, సిరాజ్ ఇంగ్లండ్ సిరీస్‌లో సాధించిన అద్భుతమైన ఫీట్, గత 34 ఏళ్లలో ఏ భారత ఫాస్ట్ బౌలర్ కూడా చేయలేదు. చివరిసారిగా ఈ ఘనత సాధించింది భారత దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ మాత్రమే. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌తో మెరుస్తున్నాడు. అతను ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే, అతని గొప్పతనం కేవలం వికెట్ల సంఖ్యలో మాత్రమే లేదు, కపిల్ దేవ్ 34 ఏళ్ల క్రితం చేసిన ఒక అరుదైన రికార్డును సిరాజ్ ఇప్పుడు బ్రేక్ చేశాడు.

34 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ ఒక సంవత్సరంలో ఆడిన రెండు టెస్ట్ సిరీస్‌లలో 150 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు వేశాడు. 1991-92లో కపిల్ దేవ్ ఈ ఘనత సాధించారు. ఇప్పుడు 34 ఏళ్ల తర్వాత, సిరాజ్ కూడా అదే పని చేసి చూపించారు. అతను ఒక సంవత్సరంలో భారతదేశం తరపున ఆడిన రెండు టెస్ట్ సిరీస్‌లలో 150+ ఓవర్లు వేశారు. మహ్మద్ సిరాజ్ 2024-25 సంవత్సరంలో ఈ రెండు టెస్ట్ సిరీస్‌లు ఆడాడు. మొదట, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సిరాజ్ 157.1 ఓవర్లు వేశారు.

ఆ తర్వాత, ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అతను ఇప్పటివరకు 155.2 ఓవర్లు వేశారు. ఇది సిరాజ్ ఫిట్‌నెస్‌ను మాత్రమే కాకుండా, భారత జట్టుకు అతని ప్రాముఖ్యతను కూడా చూపిస్తుంది. ఒక ఫాస్ట్ బౌలర్ ఇంత భారీ ఓవర్లు వేయడం చాలా అరుదైన విషయం. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించాడు. అతను ఇప్పటివరకు 155.2 ఓవర్లు బౌలింగ్ చేసి 18 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో అతను ఒకసారి 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు, ఒకసారి 4 వికెట్లు తీశాడు. వికెట్ల రేసులో రెండో స్థానంలో బెన్ స్టోక్స్ ఉన్నాడు, అయితే అతను చివరి టెస్ట్ ఆడడం లేదు. కాబట్టి, సిరాజ్ ఈ సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) అయ్యే అవకాశం ఉంది. ఇతర భారత బౌలర్ల విషయానికి వస్తే, సిరాజ్ తర్వాత జస్‌ప్రీత్ బుమ్రా 14 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆకాశ్‌దీప్ ప్రస్తుతం 12 వికెట్లు తీశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..