Mohammed Shami : టీమిండియా సెలెక్టర్లతో షమీ కోల్డ్ వార్.. అసలు గొడవ ఏంటి?
టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి తన ఫామ్, ఫిట్‌నెస్‌ను నిరూపించాడు. అంతకుముందు కూడా ఉత్తరాఖండ్‌పై 7 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్‌లో ఇంత గొప్ప ప్రదర్శన చేస్తున్నా, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీ20 జట్టులో షమీకి చోటు దక్కలేదు.

Mohammed Shami : టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ప్రస్తుతం రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 8 వికెట్లు పడగొట్టి తన ఫామ్, ఫిట్‌నెస్‌ను నిరూపించాడు. అంతకుముందు కూడా ఉత్తరాఖండ్‌పై 7 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్‌లో ఇంత గొప్ప ప్రదర్శన చేస్తున్నా, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీ20 జట్టులో షమీకి చోటు దక్కలేదు. దీంతో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ , షమీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ౌ
భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ, రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టు తరఫున ఆడుతూ అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు. గుజరాత్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో షమీ మొత్తం 8 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 18.3 ఓవర్లు బౌలింగ్ చేసి 44 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్ బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో షమీ ధాటికి తట్టుకోలేకపోయారు. షమీ ఏకంగా 5 వికెట్లు తీసి, ఫైవ్-వికెట్ హాల్ పూర్తి చేశాడు. షమీ అద్భుతమైన బౌలింగ్ కారణంగా బెంగాల్ జట్టు ఆ మ్యాచ్‌లో 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతకుముందు ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ షమీ 7 వికెట్లు తీశాడు. ఈ వరుస అద్భుత ప్రదర్శనలతో తను పూర్తిగా ఫిట్‌గా ఉన్నానని, జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నానని షమీ సెలెక్టర్లకు మెసేజ్ ఇస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో షమీ అదరగొడుతున్నా, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ స్క్వాడ్‌లో షమీకి చోటు దక్కలేదు. షమీ చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టుకు దూరంగానే ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నా, ఈ టీ20 స్క్వాడ్‌లో షమీ లేకపోవడం చర్చకు దారితీసింది.
షమీ ఫిట్‌నెస్‌పై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు, దానికి షమీ ఇచ్చిన జవాబు ఇద్దరి మధ్య చిన్న వివాదానికి దారితీసింది. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో, షమీ ఫిట్‌నెస్, జట్టులో అతని పునరాగమనం గురించి అడిగినప్పుడు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కేవలం నో అప్‌డేట్ అని సమాధానం ఇచ్చారు. అగార్కర్ వ్యాఖ్యలకు బదులుగా షమీ మీడియా ముందు స్పందించాడు. “నేను ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నేను ఫిట్‌గా లేకపోతే, రంజీ ట్రోఫీ ఎలా ఆడుతున్నాను?” అని ప్రశ్నించాడు. షమీ ఈ సమాధానం ఇచ్చిన తర్వాత అజిత్ అగార్కర్ స్పందిస్తూ.. “నాకు, షమీకి ఈ విషయం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది” అని చెప్పడం ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదని స్పష్టం చేస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




