Rinku Singh Love Story : అదే వారిద్దరినీ కలిపింది.. రింకూ సింగ్, ప్రియా సరోజ్ లవ్ స్టోరీ రివీల్
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవలే రాజకీయ నాయకురాలు, ఎంపీ అయిన ప్రియా సరోజ్తో రింకూ నిశ్చితార్థం జరిగింది. అయితే, ఒకరు క్రికెట్‌లో మరొకరు రాజకీయాల్లో ఉన్న ఈ ఇద్దరు సెలబ్రిటీల మధ్య బంధం ఎలా కుదిరింది? వారి లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది? అనే ఆసక్తి అందరిలో ఉంది.

Rinku Singh Love Story : టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇటీవలే రాజకీయ నాయకురాలు, ఎంపీ అయిన ప్రియా సరోజ్తో రింకూ నిశ్చితార్థం జరిగింది. అయితే, ఒకరు క్రికెట్‌లో మరొకరు రాజకీయాల్లో ఉన్న ఈ ఇద్దరు సెలబ్రిటీల మధ్య బంధం ఎలా కుదిరింది? వారి లవ్ స్టోరీ ఎక్కడ మొదలైంది? అనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ సీక్రెట్ రింకూ సింగ్ చిన్న చెల్లెలు నేహా సింగ్ ఒక పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టింది. వారిద్దరి బంధానికి అసలు కారణం బట్టల వ్యాపారం అని నేహా సింగ్ చెప్పడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.
రింకూ సింగ్ చెల్లెలు నేహా సింగ్, రోహిత్ ఆర్య పాడ్‌కాస్ట్‌లో రింకూ, ప్రియా సరోజ్ లవ్ స్టోరీ గురించి ఇంతకుముందు ఎవరూ వినని విషయాన్ని వివరించింది. రింకూ సింగ్, ప్రియా సరోజ్ బంధం ఏర్పడటానికి ప్రధాన కారణం బట్టల వ్యాపారం అని నేహా సింగ్ స్పష్టం చేసింది. ఇంతకుముందు, వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు, వీడియో లైక్‌ల ద్వారా లవ్ స్టోరీ మొదలైందని వార్తలు వచ్చాయి. అయితే, దాని వెనుక ఉన్న బట్టల వ్యాపార కారణాన్ని ఇప్పుడు నేహా సింగ్ బయటపెట్టింది.
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే రింకూ, ప్రియాల మధ్య పరిచయం మొదలైంది. అయితే, దాని వెనుక ఒక వ్యాపార లావాదేవీ ఉంది. నేహా సింగ్ చెప్పిన వివరాల ప్రకారం.. తమ కాబోయే వదిన ప్రియా అలీగఢ్‌లోనే ఉంటుంది. ఆమెకు అక్కడ ఒక బట్టల వ్యాపారం ఉంది. తమ వ్యాపారం గురించి రింకూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయాలని ప్రియా కోరుకుంది. దీనికోసం ప్రియా, రింకూ ఫ్రెండుకి ఫోన్ చేసింది.
ఆ పని గురించి మాట్లాడటానికి ప్రియా, రింకూ మధ్య మెసేజ్‌లు మొదలయ్యాయి. ఈ విధంగానే వారి మధ్య ప్రేమకథ ప్రారంభమైందని నేహా సింగ్ వివరించింది. ప్రియా సరోజ్ మొదటి నుంచీ రింకూ సింగ్ అభిమాని అని నేహా సింగ్ తెలిపింది. ప్రియా వాళ్ల ఇంట్లో ఆమె తండ్రి క్రికెట్ చూడకపోయినా, ప్రియాకు క్రికెట్ అంటే ఇష్టం. రింకూ సింగ్ ఎవరో ఆమెకు తెలుసు. అంటే, పరిచయం కాకముందే ప్రియాకు రింకూపై అభిమానం ఉంది. నేహా సింగ్ ప్రకారం, రింకూ సింగ్ మొదట తన తల్లికి ప్రియా సరోజ్‌తో ఉన్న ప్రేమ గురించి చెప్పాడు.
పాడ్‌కాస్ట్‌లో నేహా సింగ్‌కు, తనకు, కాబోయే వదిన ప్రియా సరోజ్‌కు మధ్య ఉన్న అనుబంధం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. నేహా సింగ్, ప్రియా సరోజ్‌ల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని చెప్పింది. ప్రియా వదిన ఎంత బిజీగా ఉన్నా, తాను ఫోన్ చేస్తే ఆమె కచ్చితంగా ఫోన్ ఎత్తుతుందని నేహా తెలియజేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




