AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glenn McGrath : కోహ్లీ నంబర్ 1.. సచిన్ కంటే రోహితే బెస్ట్ అంట..మాజీ దిగ్గజం దృష్టిలో టాప్ 5 వీళ్లే

భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. వన్డే సిరీస్ ఇప్పటికే ముగియగా టీ20 సిరీస్ ఈరోజు నుండి ప్రారంభం కానుంది. ఇటీవల మాజీ ఆసీస్ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఒక జాబితాను విడుదల చేశాడు. భారత జట్టు తరపున రాణించిన టాప్-5 వన్డే బ్యాట్స్‌మెన్‌ల జాబితాను ఆయన వెల్లడించారు.

Glenn McGrath : కోహ్లీ నంబర్ 1.. సచిన్ కంటే రోహితే బెస్ట్ అంట..మాజీ దిగ్గజం దృష్టిలో టాప్ 5 వీళ్లే
Mcgrath
Rakesh
|

Updated on: Oct 29, 2025 | 1:11 PM

Share

Glenn McGrath : భారత జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. వన్డే సిరీస్ ఇప్పటికే ముగియగా టీ20 సిరీస్ ఈరోజు నుండి ప్రారంభం కానుంది. ఇటీవల మాజీ ఆసీస్ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఒక జాబితాను విడుదల చేశాడు. భారత జట్టు తరపున రాణించిన టాప్-5 వన్డే బ్యాట్స్‌మెన్‌ల జాబితాను ఆయన వెల్లడించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఇందులో చోటు లభించినప్పటికీ, ఆయన కంటే ముందు ప్రస్తుత తరం ఆటగాళ్లకు స్థానం కల్పించడం ఆశ్చర్యకరం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్‌లను టాప్-5 భారత వన్డే బ్యాట్స్‌మెన్‌లుగా మెక్‌గ్రాత్ పేర్కొన్నాడు.

మాజీ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఎప్పటివరకు ఉన్న టాప్-5 భారత వన్డే బ్యాట్స్‌మెన్‌ల జాబితాను విడుదల చేశాడు. ఇందులో అతను రోహిత్ శర్మను సచిన్ టెండూల్కర్ కంటే పై స్థానంలో ఉంచడం, మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఆశ్చర్యకరంగా విస్మరించడం చర్చనీయాంశమైంది. మెక్‌గ్రాత్ తన జాబితాలో విరాట్ కోహ్లీకి నం. 1 ప్లేస్ ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్, సచిన్, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్‌లకు చోటు కల్పించాడు.

“ఈ జాబితాలో నేను రోహిత్ శర్మకు సెకండ్ ప్లేస్ ఇస్తాను. వన్డే క్రికెట్‌లో అతని గణాంకాలు చాలా బాగున్నాయి. అతను ఇందులో మూడు డబుల్ సెంచరీలు చేశాడు. వన్డేల్లో 264 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కూడా అతని పేరు మీద ఉంది. అతను ఇప్పటివరకు 276 మ్యాచ్‌లలో 11,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. టెస్ట్‌లతో పోలిస్తే, అతను వన్డేల్లో మెరుగ్గా రాణించాడు. రోహిత్ ఒక క్లాస్ ప్లేయర్. అందుకే నేను అతనికి సెకండ్ ప్లేస్ ఇచ్చాను. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కాకుండా మరెవరికైనా ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం చాలా కష్టం. అతని స్ట్రైక్ రేట్, యావరేజ్ అద్భుతం” అని మెక్‌గ్రాత్ విశ్లేషించాడు.

“నా నం.2 రోహిత్ శర్మ. వన్డే క్రికెట్‌లో అతని గణాంకాలు, అతను ఆడిన తీరు అద్భుతం. మూడు డబుల్ సెంచరీలు, 264 పరుగుల అత్యధిక స్కోరు చాలు. తను ఎంత గొప్ప ప్లేయరో చెప్పడానికి. 276 మ్యాచ్‌లలో 11,000 కంటే ఎక్కువ పరుగులు. వన్డే స్పెషలిస్ట్‌ అని తన మీద ముద్రపడింది. టెస్ట్ క్రికెట్‌లో అతని గణాంకాలు మరింత మెరుగ్గా ఉండాల్సింది. ఎందుకంటే అతను ఒక క్లాస్ ప్లేయర్. నేను అతన్ని నం.2 లో ఉంచుతాను” అని అన్నారు.

దాదాపు ఏడు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాపై జరిగిన వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. అతను ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సాధించి, మ్యాన్ ఆఫ్ ది సిరీసుగా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో 1000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో 2500 పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా కూడా రోహిత్ నిలిచాడు.

ఆస్ట్రేలియాపై రోహిత్‌కు స్వదేశంలో, ఆస్ట్రేలియాలో చాలా మంచి వన్డే బ్యాటింగ్ రికార్డు ఉంది. అతను 2013లో బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో వారికి వ్యతిరేకంగా తన మొదటి డబుల్ సెంచరీ (209) సాధించాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై ఐదు వన్డే సెంచరీలు ఉన్నాయి. ఇటీవల ముగిసిన భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రోహిత్ మూడు మ్యాచ్‌లలో ఆడి, 8, 73, 121 పరుగులు సాధించి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.

ఆస్ట్రేలియాలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లలో 1000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ కూడా రోహిత్. అక్టోబర్ 25న ఎస్‌సీజీలో రెండు జట్ల మధ్య జరిగిన మూడవ మ్యాచ్‌లో అతని 121 పరుగుల ఇన్నింగ్స్ సమయంలో వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై 2500 పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. టీ20 సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగుతున్నాడు. అతని పాత అద్భుతమైన ప్రదర్శనలకు తోడు, ఇప్పుడు టీ20ఐలలో అతను పవర్‌ప్లేలో మరింత దూకుడుగా బౌలింగ్ చేస్తాడని భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?