టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ నబీ తన పదవికి రాజీనామా చేశాడు. సూపర్-12 చివరి మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో తమ గ్రూప్‌లో చివరి స్థానంలో నిలిచిన ఆఫ్ఘన్ జట్టు ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. కాగా ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన ఆఫ్గన్‌కు టీ20 ప్రపంచ కప్‌లో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. వర్షం కారణంగా ఏకంగా రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో కేవలం 2 పాయింట్లు మాత్రమే ఆ జట్టు ఖాతాలో చేరాయి. అయితే చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను దాదాపు ఓడించినంత పనిచేసింది. అయితే నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఈనేపథ్యంలోఅడిలైడ్‌లోనే ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశాడు.
‘టీ20 వరల్డ్‌కప్‌లో మా ప్రయాణం నేటితో ముగిసింది. ప్రపంచకప్‌లో మాకు వచ్చిన ఫలితాలు మాకు కానీ, మా అభిమానులకు కానీ నచ్చలేదు. అందుకే జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా. ఏడాది కాలంగా నుంచి మా జట్టు సన్నద్ధత అనుకున్న స్థాయిలో లేదు. పైగా, గత కొన్ని పర్యటనలలో జట్టు మేనేజ్‌మెంట్, సెలక్షన్ కమిటీ, నేను ఒకే లైన్‌లో లేం. ఇది జట్టు ప్రదర్శనపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. అందుకే కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవడంలో ఇదే సరైన సమయమని భావించాను. ఇదే విషయాన్ని మేనేజ్‌మెంట్‌కు తెలిపాను .కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికి ఒక ఆటగాడిగా మాత్రం జట్టులో కొనసాగుతాను. ఇన్నాళ్లు కెప్టెన్‌గా మద్దతు ఇచ్చిన జట్టు సహచరులతో పాటు ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇక వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు దెబ్బతిన్నప్పటికి మాపై అభిమానంతో మైదానాలకు వచ్చిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ నిజంగా మాకు చాలా ముఖ్యమైనది. లవ్ యూ అఫ్గానిస్తాన్’ అంటూ తన వీడ్కోలు ప్రకటనలో తెలిపాడు నబి.
— Mohammad Nabi (@MohammadNabi007) November 4, 2022
టాప్-10లోకి..
కాగా నబీ హయాంలోనే ఆఫ్టన్ అంతర్జాతీయ క్రికెట్‌లో మరపురాని విజయాలు సొంతం చేసుకుంది. అతని నేతృత్వంలోనే ఆఫ్గన్ జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-10లోకి వచ్చింది. 2017లో ఆఫ్గన్ టెస్టు హోదా కూడా పొందింది. ఇక కెరీర్ విషయానికొస్తే.. మహ్మద్ నబీ 28 వన్డేలు, 35 టీ20ల్లో అఫ్గానిస్తాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
It was an honour to be part of ?? at the #ICCT20WorldCup2022 ?
Not the outcome we hoped for but we will take this as an experience to learn and comeback even stronger ?
Thank you to all the fans for your love and support ❤️
Good luck to the rest of the teams ? pic.twitter.com/zasaaqdpLh
— Rashid Khan (@rashidkhan_19) November 4, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..