ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే T20 ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. యూఎస్‌ఏ-వెస్టిండీస్‌లో జరగనున్న ఈ టీ20 ప్రపంచకప్ కోసం అన్ని దేశాలు తమ తమ జట్లను మే 1లోగా ప్రకటించాల్సి ఉంది. ఐపీఎల్‌లో ప్లేయర్ల ఆటతీరును పరిగణనలోకి తీసుకుని పటిష్టమైన భారత జట్టును ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేసింది. కాగా, ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఎలా ఉండాలో మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తెలిపాడు. మహ్మద్ కైఫ్ త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టులో రింకూ సింగ్, సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్‌లకు చోటు దక్కకపోవడం గమనార్హం. బదులుగా వీరి స్థానాల్లో శివమ్ దూబే, రియాన్ పరాగ్ ఎంపికయ్యారు. అలాగే స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్‌లకు చోటు దక్కింది. పేసర్ల జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లు చోటు దక్కించుకున్నారు. రిషబ్ పంత్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు.
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రియాన్ పరాగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, శివమ్ దూబే, మహ్మద్ సిరాజ్
Mohammad Kaif said – “The way Virat Kohli walks into the ground, even for practice session, seems like a player coming. He’s in the Zone. Even he’s routine is set before match, he’s doing some batting practice & then catching practice & then match. His commitment is next level”. pic.twitter.com/5qNXrZGK3h
— CricketMAN2 (@ImTanujSingh) April 6, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..