Mithali Raj Retirement: భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ (Mithali Raj) సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు తెలపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది.
Mithali Raj Retirement: భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ (Mithali Raj) సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు తెలపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. కాగా వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించడంతో పాటు అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకుందీ ఈ లేడీ మాస్టర్ బ్లాస్టర్. ‘కొంతమంది ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ల చేతుల్లో భారత జట్టు బలంగా ఉంది. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను వీడ్కోలు తీసుకోవడానికి ఇదే సరైన సమయమని నేను భావిస్తున్నాను. అన్ని ప్రయాణాల మాదిరిగానే ఇది కూడా ముగియాలి. ఈ రోజు నేను అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నాను. నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ, భారత్‌ను గెలిపించాలనే ఉద్దేశ్యంతో నా అత్యుత్తమమైన ఆటతీరును ప్రదర్శించాను. టీమిండియాకు ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. ఇన్నేళ్లుగా జట్టుకు నాయకత్వం వహించడం గౌరవంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా మీరు నాపై ప్రేమాభిమానాలు చూపారు. అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ఆశీర్వాదం, మద్దతుతో త్వరలోనే నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తాను. భారత క్రికెట్ నియంత్రణ మండలి, కార్యదర్శి జై షాకు మిథాలీ ప్రత్యేక ధన్యవాదాలు’ అని మిథాలీ ట్విట్టర్‌లో పేర్కొంది.
Thank you for all your love & support over the years!
I look forward to my 2nd innings with your blessing and support. pic.twitter.com/OkPUICcU4u
మిథాలీరాజ్ 1999లో అంతర్జాతీయ క్రికెట్ లో కి అడుగుపెట్టింది. తొలి వన్డేలోనే సెంచరీ సాధించింది. ఆటతీరుతోనే కాకుండా నాయకత్వ ప్రతిభతో రెండు 50 ఓవర్ల ప్రపంచ కప్ ఫైనల్స్‌ను టీమిండియాను చేర్చింది. అదేవిధంగా 232 మ్యాచ్‌లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి .. 50.68 సగటుతో 7805 పరుగులు చేసింది. అత్యధిక స్కోరు 125 నాటౌట్ గా. అందులో మొత్తం 7 సెంచరీలు, 64 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక కెరీర్ లో 12 టెస్టులు ఆడి 699 రన్స్ సాధించింది మిథాలీ రాజ్. అందులో ఒక శతకం, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 214 పరుగులు. ఇక 89 టీ20 మ్యాచులు ఆడిన లేడీ సచిన్ 2,364 పరుగులను సాధించింది. వాటిలో 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.