DC vs MI IPL Match Result: ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీదే విజయం.. ముంబై బౌలర్లను ఉతికారేసిన లలిత్ యాదవ్, అక్షర్ పటేల్..

Delhi Capitals vs Mumbai Indians IPL Match Result: బ్రాబోర్న్ స్టేడియంలో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టీం ఓటమి పాలైంది. దీంతో ఐపీఎల్ లీగ్‌లో తొలి మ్యాచ్‌లో ఓడిపోయే సెంటిమెంట్‌ను మరోసారి నిజం చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ఈ సీజన్‌ను ప్రారంభించింది.

DC vs MI IPL Match Result: ఉత్కంఠ మ్యాచ్‌లో ఢిల్లీదే విజయం.. ముంబై బౌలర్లను ఉతికారేసిన లలిత్ యాదవ్, అక్షర్ పటేల్..
Ipl 2022 Dc Vs Mi Axar Patel
Follow us
Venkata Chari

|

Updated on: Mar 27, 2022 | 7:38 PM

ఈరోజు ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లో బ్రాబోర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ముంబై ఇచ్చిన 178 పరుగుల టార్గెట్‌ను.. ఢిల్లీ క్యాపిటల్స్ టీం 6 వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు ఉండగానే ఛేదించి, విజయం సాధించింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓడిపోతారనుకున్న మ్యాచ్‌ను అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ పూర్తిగా మార్చేశారు. వీరిద్దరూ 75 పరుగుల భాగస్వామ్యంతో ఢిల్లీని విజయతీరాలకు చేర్చారు. అక్షర్ పటేల్ కేవలం 17 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సులతో 38 పరుగులు, లలిత్ యాదవ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు సాధించి, ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. ఢిల్లీ బ్యాటర్లలో షా 38, టిమ్ 21, మన్దీప్ 0, రిషబ్ పంత్ 1, పొవెల్ 0, శార్దుల్ 22 పరుగులు చేశారు. మురుగన్ అశ్విన్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. దీని తర్వాత థంపి కూడా ఒకే ఓవర్‌లో 2 వికెట్లు తీశారు. ఇక ముంబై ఇండియన్స్ టీం తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం అలవాటుగా మారింది. గత సీజన్‌లోనూ ఇదే జరిగింది. నేటి మ్యాచులో 16 ఓవర్ల వరకు గెలుస్తారనే అంతా అనుకున్నారు. కానీ, చివర్లో మాత్రం గత సీజన్‌ల సెంటిమెంట్‌కు బలైంది.

అంతకు ముందు ముంబై ఇండియన్ టీం నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 177 పరుగులు పూర్తి చేసింది. ఇషాన్ కిషన్ 81 పరగులతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ 41, తిలక్ వర్మ 22, సింగ్ 8, పొలార్డ్ 3, టిమ్ డేవిడ్ 12 పరుగులు చేశారు. టాస్ గెలిచిన ఢిల్లీ టీం బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై టీం తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఓపెనర్లు రోహిత్, ఇషాన్ తుఫాన్ ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చైనామన్ కుల్దీప్ ఢిల్లీ టీంకు బ్రేక్ త్రూ అందించాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్ వైపు కదులుతున్న సమయంలో రోహిత్‌ను స్పిన్‌తో పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో 2 వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.

ముంబై ఓపెనర్లు రోహిత్, ఇషాన్ తుఫాన్ ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ అర్ధ సెంచరీని కోల్పోయాడు. అయితే ఇషాన్ కిషన్ 81 పరుగులు చేసి స్కోరును 177కు తీసుకెళ్లాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్, రోహిత్ మినహా పెద్దగా ఎవరూ రాణించలేకపోయారు.

9 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో ఫిఫ్టీ కొట్టలేకపోయిన రోహిత్..

రోహిత్ శర్మ 32 బంతుల్లో 41 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ చేతిలో ఔటయ్యాడు. డీప్ మిడ్‌వికెట్‌లో రోవ్‌మన్ పావెల్‌కి హిట్‌మ్యాన్ క్యాచ్ ఇచ్చాడు. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో వరుసగా తొమ్మిదోసారి యాభై పరుగులు చేయకుండానే ఔటయ్యాడు. గత ఏడాది ఏప్రిల్ 23న పంజాబ్‌పై చివరి హాఫ్ సెంచరీ చేశాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, టిమ్ సీఫెర్ట్, మన్‌దీప్ సింగ్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, కమలేష్ నాగర్‌కోటి

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్, జస్ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి