Watch Video: బెస్ట్ క్యాచ్ అంటే ఇదేనేమో.. చిరుతలా దూకి ఒడిసిపట్టిన ఢిల్లీ ప్లేయర్.. చూస్తే షాకవ్వాల్సిందే.. వైరల్ వీడియో..
16వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయగా, 5వ బంతికి కీరన్ పొలార్డ్ మిడ్ వికెట్ వైపు వేగంగా షాట్ ఆడాడు. పొలార్డ్ కొట్టిన షాట్ స్పీడ్ చూస్తుంటే బంతి బౌండరీ లైన్ వద్దకు చేరుతుందని అనిపించినా..
IPL 2022 రెండవ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బ్రబౌర్న్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ముంబయి విజయం ఖాయంగా కనిపించినా.. ఆ తర్వాత ఢిల్లీకి చెందిన లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ లు ఫలితాన్ని తారుమారు చేశారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 30 బంతుల్లో 75 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఢిల్లీకి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఢిల్లీ టాస్ గెలిచి ముంబైని బ్యాటింగ్‌కు పిలిచింది. అయితే, ముంబై ఇన్నింగ్స్ 16వ ఓవర్లో టిమ్ సీఫెర్ట్ అద్భుత క్యాచ్ పట్టాడు. 16వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చేయగా, 5వ బంతికి కీరన్ పొలార్డ్ మిడ్ వికెట్ వైపు వేగంగా షాట్ ఆడాడు. పొలార్డ్ కొట్టిన షాట్ స్పీడ్ చూస్తుంటే బంతి బౌండరీ లైన్ వద్దకు చేరుతుందని అనిపించినా.. బంతిని గాలిలో డైవింగ్ చేస్తూ సీఫెర్ట్ బెస్ట్ క్యాచ్ పట్టాడు. ఇప్పటి వరకు 15వ సీజన్‌లో ఇదే అద్భుత క్యాచ్ అని అంటున్నారు. ఈ క్యాచ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 3 వికెట్లు తీశాడు. రోహిత్ శర్మ (41), అన్మోల్‌ప్రీత్ సింగ్ (8), కీరన్ పొలార్డ్ (3)లను కుల్దీప్ అవుట్ చేశాడు. కుల్దీప్ 2 సంవత్సరాల తర్వాత అంటే 11 మ్యాచ్‌ల తర్వాత IPL మ్యాచ్‌లో 2 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. చివరిసారి 2019 మార్చిలో ఢిల్లీపై కుల్దీప్ యాదవ్ 41 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
దీని తర్వాత IPL 2020 సీజన్ అతనికి చాలా చెడ్డది. 2020లో KKR తరపున ఆడుతున్నప్పుడు కుల్దీప్ 5 మ్యాచ్‌లలో 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. 2021 సీజన్‌లో అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం లభించలేదు. కేకేఆర్‌తో పాటు కుల్దీప్‌ను కూడా టీమ్ ఇండియా నుంచి తప్పించారు. IPL 2022 మెగా వేలంలో, చైనామాన్ కుల్దీప్ యాదవ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
WHAT A CATCH! ?
TIM SEIFERT, TAKE A BOW! ?#IPL2022 #YehHaiNayiDilli #DCvMI #DCvsMI pic.twitter.com/g9PPLHE7gC
— Cricket Spectacle ? (@CricketSpectac1) March 27, 2022