
MS Dhoni Retainment: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా 38వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్ జట్టు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. ఈ విజయంతో, ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 4 ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలతో పట్టికలో అట్టడుగున ఉంది. చెన్నైపై విజయానికి హీరో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ అనడంలో సందేహం లేదు. రోహిత్ అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి సూర్యకుమార్ యాదవ్ మద్దతు ఇచ్చాడు. మ్యాచ్ సందర్భంగా, చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొన్ని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు. ఇది అందరినీ షాక్‌కు గురిచేసింది.
మ్యాచ్ తర్వాత, మా జట్టు ప్రదర్శన దారుణంగా ఉందని చెన్నై కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ‘మ్యాచ్ రెండవ భాగంలో కొంత మంచు కురుస్తుందని నాకు తెలుసు, జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోని అత్యుత్తమ డెత్ బౌలర్లలో ఒకరని తెలిసిందే. ముంబై ఇండియన్స్ వారి డెత్ బౌలింగ్‌ను ముందుగానే ప్రారంభించారు. దీని వలన మేం ఎక్కువ పరుగులు చేయలేకపోయాం. ఆయుష్ మాత్రే బాగా బ్యాటింగ్ చేశాడని, తన షాట్లను అద్భుతంగా ఎంచుకున్నాడని’ ధోని తెలిపాడు. ఈ పిచ్‌పై పరుగులు సాధించడం అంత సులభం కాదని, తొలి ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇస్తే అది కష్టమవుతుందంటూ ఆయన పేర్కొన్నాడు.
మంచి క్రికెట్ ఆడటం వల్లే విజయం సాధిస్తున్నామని అర్థం చేసుకోవాలని చెన్నై కెప్టెన్ ధోని అన్నాడు. భావోద్వేగానికి గురికాకూడదని, ఒక్కో మ్యాచ్‌ని ఎదుర్కోవాలి, ప్లేఆఫ్‌లకు చేరుకోకపోతే, తదుపరి సీజన్ కోసం మన వ్యూహం గురించి ఆలోచించాలంటూ తెలిపాడు. ఈ క్రమంలో తదుపరి సీజన్ గురించి మాట్లాడిన ధోని.. IPL 2026 లోనూ ఆడేందుకు సిద్ధమని హింట్ హిచ్చేశాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..