మూడో టెస్టు మ్యాచ్‌కి భారత జట్టు ఎంపిక గురించి మాట్లాడే సమయంలో ఆసక్తికర సంఘటన జరిగింది. లెజెండరీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మాథ్యూ హేడెన్ లైవ్ ప్రసారంలో తడబడి, కేఎల్ రాహుల్ స్థానంలో రాహుల్ ద్రవిడ్ కావాలని చెప్పడం ప్రేక్షకులను నవ్వులు పూయించింది. హేడెన్ చేసిన ఈ వ్యాఖ్య భారత క్రికెట్ అభిమానుల మధ్య చర్చనీయాంశమైంది.
పింక్ బాల్ టెస్ట్‌లో భారత బ్యాటింగ్ వైఫల్యంపై విశ్లేషణ చేస్తూ, హేడెన్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అతను రాహుల్‌కు మద్దతుగా మాట్లాడుతూ, “టెక్నికల్ గా మంచి ఆటగాడు” అని పేర్కొన్నప్పటికీ, KL రాహుల్ స్థానంలో పొరపాటుగా రాహుల్ ద్రవిడ్ అని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యతో సునీల్ గవాస్కర్ కూడా నవ్వకుండా ఉండలేకపోయారు. గవాస్కర్ వెంటనే స్పందిస్తూ, “మీరు రాహుల్ ద్రవిడ్ గురించి మాట్లాడితే నేను ఇష్టపడతాను, కానీ అది కేఎల్ రాహుల్,” అంటూ హేడెన్‌ను వెక్కిరించారు.
హేడెన్ తన వ్యాఖ్యల తడబాటును కవర్ చేసేందుకు రాహుల్ ద్రవిడ్‌పై ప్రసంశలు కురిపించాడు. అడిలైడ్‌లో ద్రవిడ్ చేసిన సెంచరీలు ఇప్పటికీ నా మదిలో ఉన్నాయి అని, 2003/04 సిరీస్‌లో మమ్మల్ని ఓడించిన సమయంలో అతను చూపిన ఆధిపత్యం నాకు మరచిపోలేని అనుభవం అంటూ తన పొరపాటును సరదాగా ఆవిష్కరించాడు హేడెన్.
ఈ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదాన్ని అందించింది. రాహుల్ ద్రవిడ్, KL రాహుల్ అనే పేర్లతో ఆటగాళ్ల మధ్య ఉన్న పోలికలు ఇలా కాస్త జోక్‌లకు దారితీశాయి. అయితే, ఈ ఘటన హేడెన్‌కి కూడా నైజంగా తన విశ్లేషణను సరదాగా చెప్పుకునే అవకాశం ఇచ్చింది. మాథ్యూ హేడెన్ తడబాటు క్రికెట్ ప్రపంచానికి వినోదాన్ని అందించింది!
Gavaskar wants Rohit to open, Hayden wants… Dravid back in the XI?? #AUSvIND | @StarSportsIndia pic.twitter.com/9nkbUFFv8X
— ESPNcricinfo (@ESPNcricinfo) December 10, 2024