AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం అంటే వీడిదే భయ్యా.. స్టంప్స్‌ను తాకినా కింద పడని బెయిల్స్.. నక్క తోక తొక్కేశాడుగా

Pakistan vs South Africa 2nd Test: మార్కో జాన్సెన్ వేసిన బంతి వికెట్‌ను తాకినా బెయిల్స్ పడకపోవడం ఆ రోజు ఆటలో అత్యంత చర్చనీయాంశమైంది. ఈ అద్భుతమైన తప్పించుకోవడంతో షఫీక్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించి, జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించాడు.

అదృష్టం అంటే వీడిదే భయ్యా.. స్టంప్స్‌ను తాకినా కింద పడని బెయిల్స్.. నక్క తోక తొక్కేశాడుగా
Marco Jansen
Venkata Chari
|

Updated on: Oct 21, 2025 | 8:16 AM

Share

Marco Jansen: క్రికెట్ మ్యాచ్‌లో కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతుంటాయి. అటువంటిదే పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ (Marco Jansen) వేసిన బంతి పాకిస్థాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (Abdullah Shafique) వికెట్‌ను తాకినా, బెయిల్స్ (Bails) మాత్రం కిందపడలేదు. దీంతో షఫీక్ అవుట్ కాకుండా బతికిపోయాడు.

అసలేం జరిగింది?

పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ వేసిన ఒక ఫుల్ లెంగ్త్ డెలివరీ, ఆఫ్-స్టంప్‌కు బయట నుంచి లోపలికి స్వింగ్ అయింది.

ఇవి కూడా చదవండి

అబ్దుల్లా షఫీక్ ఆ బంతిని నేరుగా ఆడటానికి ప్రయత్నించాడు. కానీ, బంతి అతని బ్యాట్‌ను తప్పించుకుని వికెట్‌ను తాకింది.

సాధారణంగా బంతి స్టంప్స్‌ను బలంగా తాకితే బెయిల్స్ ఎగిరిపోతాయి. కానీ ఈ సందర్భంలో, బంతి తాకినప్పటికీ, బెయిల్స్ అదే స్థానంలో ఉండిపోయాయి.

ఆన్-ఫీల్డ్ అంపైర్ షఫీక్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. ఎందుకంటే, ‘బెయిల్స్ కింద పడలేదు’.

డీఆర్‌ఎస్ (DRS)లో స్పష్టమైనా..

దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వెంటనే దీనిని డీఆర్‌ఎస్‌ (DRS) ద్వారా రివ్యూ కోరారు. టీవీ రీప్లేలో, అల్ట్రాఎడ్జ్ (UltraEdge) స్క్రీన్‌పై బంతి వికెట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించినప్పటికీ, అవుట్ ఇవ్వలేదు.

క్రికెట్ నిబంధనల ప్రకారం, బ్యాట్స్‌మెన్‌ను ‘బౌల్డ్’ ద్వారా అవుట్ చేయాలంటే, బంతి వికెట్‌ను తాకి, కచ్చితంగా బెయిల్స్‌ కిందపడాల్సి ఉంటుంది.

బెయిల్స్ కేవలం కదిలి, తిరిగి స్థిరపడితే లేదా పూర్తిగా తొలగించబడకపోతే, బ్యాటర్ నాటౌట్‌గా ఉంటాడు. ఈ నియమం కారణంగా షఫీక్‌కు అదృష్టం కలిసి వచ్చింది.

షఫీక్‌కు అదృష్టం మామూలుగా లేదు..!

నిజానికి, ఆ మ్యాచ్‌లో అబ్దుల్లా షఫీక్‌కు అదృష్టం పలుమార్లు తోడైంది. మ్యాచ్ మొదటి ఓవర్‌లోనే, కగిసో రబాడా బౌలింగ్‌లో షఫీక్ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్ ట్రిస్టన్ స్టబ్స్ జారవిడిచాడు.

ఆ తర్వాత, స్పిన్నర్ కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో కూడా క్యాచ్, స్టంపింగ్ ద్వారా అవుటయ్యే ప్రమాదం నుంచి షఫీక్ తప్పించుకున్నాడు.

మార్కో జాన్సెన్ వేసిన బంతి వికెట్‌ను తాకినా బెయిల్స్ పడకపోవడం ఆ రోజు ఆటలో అత్యంత చర్చనీయాంశమైంది. ఈ అద్భుతమైన తప్పించుకోవడంతో షఫీక్ తన ఇన్నింగ్స్‌ను కొనసాగించి, జట్టుకు మంచి భాగస్వామ్యాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..