IPL 2025: విశాఖ చేరిన లక్నో టీం.. ఢిల్లీతో పోరుకు సై..
Delhi Capitals vs Lucknow Super Giants, 4th Match: లక్నో సూపర్ జెయింట్స్ టీం వచ్చేసింది. సోమవారం జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కోసం విశాఖ చేరుకుంది. ఫస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడనుంది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్.. విశాఖ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఈసారి లక్నో జట్టుకు రిషబ్ పంతే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

LSG vs DC: ఐపీఎల్-18లో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు లక్నో సూపర్ జెంట్స్ టీమ్ విశాఖ చేరుకుంది. ప్రత్యేక విమానంలో లక్నో నుంచి విశాఖకు వచ్చింది. ఈనెల 24 అంటే సోమవారం ఢిల్లీతో తలబడేందుకు రెండ్రోజుల ముందే వైజాగ్ చేరుకుంది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్.. విశాఖ స్టేడియంలో రెండు మ్యాచ్‌లు ఆడాడు. ఈసారి లక్నో జట్టుకు రిషబ్ పంతే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఇక ఇప్పటికే విశాఖ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. లక్నో టీమ్ ఇవాళ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది. ఎల్‌ఎస్‌జీ జట్టుకు మెంటర్‌గా జహీర్ ఖాన్, హెడ్ కోచ్‌గా లాంగర్, సహాయ కోచ్‌లుగా జాంటీ రోడ్స్, ప్రవీణ్ తంబే, లాన్స్ క్లుసెనర్ ఉన్నారు. జట్టులో వికెట్ కీపర్లుగా ఆర్యన్, నికోలస్ అందుబాటులో ఉన్నారు. ఆల్‌రౌండర్లుగా మార్క్రమ్, మార్ష్, షాబాజ్ ఉండగా, బ్యాటింగ్‌లో ఆయుష్, డేవిడ్ మిల్లర్, సమద్ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.
ఇక బౌలింగ్‌లో రవి బిష్ణోయ్, ఆవేష్, ఆకాష్‌తో జట్టు బలంగా కనిపిస్తోంది. ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కూడా పటిష్టంగానే ఉంది. గత సీజన్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన ఇరు జట్లు.. ఈసారి వైజాగ్ వేదికగా బోణి కొట్టి సీజన్‌ను ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..