Video: విజయానికి 9 పరుగులు.. కట్‌చేస్తే.. 6 బంతుల్లో ఎవ్వరూ ఊహించని రిజల్ట్.. బ్రహ్మరాతనే మార్చేశాడుగా

Rajasthan Royals vs Lucknow Super Giants, 36th Match: రాజస్థాన్ రాయల్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. విజయానికి చేరువగా వచ్చిన తర్వాత ఓడిపోవడం అలవాటు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఆ జట్టు విజయానికి దగ్గరగా వచ్చిన తర్వాత తేలిపోయింది. లక్నో విషయంలో మాత్రం లక్ కొద్దిగా ఫేవర్‌గా కనిపించింది.

Video: విజయానికి 9 పరుగులు.. కట్‌చేస్తే.. 6 బంతుల్లో ఎవ్వరూ ఊహించని రిజల్ట్.. బ్రహ్మరాతనే మార్చేశాడుగా
Avesh Khan Lsg Vs Rr

Updated on: Apr 20, 2025 | 6:55 AM

Avesh Khan: ఐపీఎల్ (IPL) 2025 లో భాగంగా 36 వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో, లక్నో రెండు పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయానికి హీరో ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి ఓవర్లలో యశస్వి జైస్వాల్ తో సహా ముగ్గురు బ్యాటర్లను అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ గెలవడానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం. కానీ, రాజస్థాన్ జట్టు అవేష్ ఖాన్ డేంజరస్ బౌలింగ్ కు తలొగ్గి, ఉత్కంఠ మ్యాచ్‌లో ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు 8 మ్యాచ్‌ల్లో ఆరోసారి ఓడిపోయింది. దీంతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. లక్నో జట్టు 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో నాల్గవ స్థానంలో నిలిచింది.

చివరి ఓవర్లో అవేష్ అద్భుతం..

రాజస్థాన్ ఇన్నింగ్స్ 20వ ఓవర్లో అవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చివరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం. ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్ క్రీజులో ఉన్నారు. 20వ ఓవర్ మొదటి బంతికి అవేష్ ఖాన్ యార్కర్ వేయగా, జురెల్ ఒక పరుగు తీశాడు. రెండవ బంతికి, హెట్మెయర్ డీప్ పాయింట్‌కి షాట్ కొట్టడం ద్వారా ఒక పరుగు తీశాడు. ఈ సమయంలో, శార్దూల్ ఠాకూర్ ఫీల్డింగ్ తప్పిదంతో, ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ మరో పరుగును తమ ఖాతాలో వేసుకున్నారు.

ఇప్పుడు రాజస్థాన్ గెలవడానికి 4 బంతుల్లో 6 పరుగులు అవసరం. మూడో బంతికి హెట్మెయర్‌ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత, శుభం దూబే బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ, నాల్గవ బంతికి పరుగులు చేయలేకపోయాడు. ఐదవ బంతికి డేవిడ్ మిల్లర్ తన క్యాచ్‌ను వదిలివేశాడు. ఈ క్రమంలో అతను రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి రాజస్థాన్ విజయానికి 4 పరుగులు అవసరం. శుభం దూబే నుంచి ఆ జట్టు ఒక అద్భుతాన్ని ఆశించింది. కానీ, అవేష్ ఖాన్ చివరి బంతికి ఒకే ఒక పరుగు ఇచ్చి మ్యాచ్‌ను లక్నో ఖాతాలో వేసుకున్నాడు. అవేష్ ఖాన్ 4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

18వ ఓవర్లో కీలక మలుపు..

18వ ఓవర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న యశస్వి జైస్వాల్‌ను అవేష్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేసి, లక్నోను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు. యశస్వి 52 బంతుల్లో 74 పరుగులు చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి, వేగంగా పరుగులు సాధిస్తున్న కెప్టెన్ రియాన్ పరాగ్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఇది లక్నో విజయ ఆశలను పెంచింది. రియాన్ పరాగ్ 26 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ చరిత్రలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. తన అరంగేట్రంలో 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 2 ఫోర్లు,3 సిక్సర్లు కొట్టాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..