LSG vs GT Score: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శుభ్మన్ గిల్.. లక్నో ముందు స్వల్ప టార్గెట్..

|

May 10, 2022 | 9:32 PM

Lucknow Super Giants vs Gujarat Titans: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. దీంతో లక్నో టీం ముందు 145 పరుగుల టార్గెట్ ఉంది.

LSG vs GT Score: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శుభ్మన్ గిల్.. లక్నో ముందు స్వల్ప టార్గెట్..
Lsg Vs Gt
Follow us on

ఐపీఎల్ 2022(IPL 2022)లో భాగంగా 57వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టీం(Gujarat Titans)తో లక్నో సూపర్ జెయింట్‌(Lucknow Super Giants) తలపడుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో శుభమాన్ గిల్ నాలుగో అర్థసెంచరీతో అజేయంగా 63 పరుగులు చేశాడు. లక్నో తరపున ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్ గరిష్టంగా రెండు వికెట్లు పడగొట్టాడు.

గుజరాత్ శుభారంభం చేయడంలో విఫలమైంది. వృద్ధిమాన్ సాహా 11 బంతుల్లో 5 పరుగులు చేసి మొహ్సిన్ ఖాన్‌కు బలయ్యాడు. మాథ్యూ వేడ్ (10) వికెట్ ను అవేశ్ ఖాన్ పడగొట్టాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (11) వికెట్ కూడా అవేష్ ఖాన్ కు దక్కింది. డేవిడ్ మిల్లర్ 26 పరుగులు చేసి జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో ఆయుష్ బదోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌కు ముందు, రెండు కొత్త జట్లు సీజన్‌లో తమ ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాయి. LSG 11 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచింది. అలాగే నెట్ రన్ రేట్ +0.703గా నిలిచింది. GT కూడా 11 మ్యాచ్‌లలో 8 గెలిచింది. అలాడే నెట్ రన్ రేట్ +0.120.

ఇవి కూడా చదవండి

ఇరు జట్లు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కరణ్ శర్మ, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, మొహ్సిన్ ఖాన్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(కీపర్), శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: Shimron Hetmyer: తండ్రిగా ప్రమోషన్‌ పొందిన రాజస్థాన్‌ స్టార్‌ ప్లేయర్‌.. బిడ్డ ఫొటోనూ షేర్‌ చేస్తూ ఎమోషనల్‌..

IPL 2022: బట్టలు లేక టవల్ కట్టుకునే హోటల్లో ఉన్న.. షాకింగ్ విషయాలు చెప్పిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రోవ్‌మన్ పావెల్..