IPL 2024: వరుస ఓటములతో లక్నోకు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కేఎల్ రాహుల్?

KL Rahul: IPL 2022 మెగా వేలానికి ముందు రాహుల్‌ను 17 కోట్ల రూపాయలకు లక్నో తీసుకుంది. కెప్టెన్సీని అప్పగించింది. అతని కెప్టెన్సీలో జట్టు వరుసగా రెండు ప్లేఆఫ్‌లు ఆడింది. అయితే ఇప్పుడు ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అతడిని రిటైన్ చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లకు ముందు రాహుల్ కెప్టెన్సీ నుంచి వైదొలిగి బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి సారిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

IPL 2024: వరుస ఓటములతో లక్నోకు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న కేఎల్ రాహుల్?
Lsg Captain Rahul

Updated on: May 10, 2024 | 2:27 PM

KL Rahul: ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్‌తో కేఎల్ రాహుల్ భవిష్యత్తు అయోమయంలో పడింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత అతను జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. భవిష్యత్తులో జరిగే మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్‌ పాత్రలో మాత్రమే ఆడడం చూడొచ్చు. లక్నో ప్రస్తుతం IPL 2024 కోసం ప్లేఆఫ్ రేసులో ఉంది. జట్టుకు రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండు గెలిస్తే వరుసగా మూడో సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో స్థానం పొందవచ్చు. కానీ జట్టు నెట్ రన్ రేట్ చాలా దారుణంగా ఉంది. ఒక్క ఓటమి ఎదురైనా.. ప్లే ఆఫ్ రేసులో వెనుకంజ వేయాల్సిందే. ఇదిలా ఉంటే, హైదరాబాద్‌పై ఓటమి తర్వాత జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కోపంగా వ్యవహరించడం రాహుల్‌కు ఇబ్బంది కలిగించింది.

IPL 2022 మెగా వేలానికి ముందు రాహుల్‌ను 17 కోట్ల రూపాయలకు లక్నో తీసుకుంది. కెప్టెన్సీని అప్పగించింది. అతని కెప్టెన్సీలో జట్టు వరుసగా రెండు ప్లేఆఫ్‌లు ఆడింది. అయితే ఇప్పుడు ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు అతడిని రిటైన్ చేసే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మిగిలిన రెండు మ్యాచ్‌లకు ముందు రాహుల్ కెప్టెన్సీ నుంచి వైదొలిగి బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి సారిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

లక్నోతో రాహుల్ భవిష్యత్తు ఎలా ఉండనుందంటే..

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కి జట్టుకు ఐదు రోజుల సమయం ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని రాహుల్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. దీనికి యాజమాన్యానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..