IPL 2024: ప్రమాదంలో మయాంక్ యాదవ్ కెరీర్.. రక్షించాలంటూ బీసీసీఐకి పిలుపునిచ్చిన మాజీ ప్లేయర్.. ఎందుకంటే?

|

Apr 06, 2024 | 4:44 PM

IPL 2024: మయాంక్ యాదవ్ ఐపీఎల్‌లో తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నప్పటికీ, అతడిని టెస్టు క్రికెట్‌కు పరిచయం చేసేందుకు తొందరపడడం తెలివైన పని కాదని ఆస్ట్రేలియాకు చెందిన రెండుసార్లు ప్రపంచకప్ వెటరన్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. పంజాబ్ కింగ్స్‌పై అరంగేట్రం చేసిన మయాంక్, ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌ తరపున ఆడుతున్నాడు.

IPL 2024: ప్రమాదంలో మయాంక్ యాదవ్ కెరీర్.. రక్షించాలంటూ బీసీసీఐకి పిలుపునిచ్చిన మాజీ ప్లేయర్.. ఎందుకంటే?
Mayank Yadav
Follow us on

Mayank Yadav: ఐపీఎల్ 2024లో మయాంక్ యాదవ్ తన స్పీడ్‌తో యావత్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. చాలా మంది బ్యాట్స్‌మెన్స్ ఈ కుర్రాడి వేగానికి లొంగిపోయారు. అయితే, మయాంక్ ప్రమాదంలో ఉన్నాడని, ఆస్ట్రేలియా అనుభవజ్ఞుడు హెచ్చరించాడు. ఈ యంగ్ ప్లేయర్ ప్రమాదం గురించి భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు కూడా సూచించాడు.

మయాంక్ యాదవ్ ఐపీఎల్‌లో తన బౌలింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నప్పటికీ, అతడిని టెస్టు క్రికెట్‌కు పరిచయం చేసేందుకు తొందరపడడం తెలివైన పని కాదని ఆస్ట్రేలియాకు చెందిన రెండుసార్లు ప్రపంచకప్ వెటరన్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ అభిప్రాయపడ్డాడు. పంజాబ్ కింగ్స్‌పై అరంగేట్రం చేసిన మయాంక్, ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌ తరపున ఆడుతున్నాడు. ఈ 21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ రెండు మ్యాచ్‌లు ఆడాడు. రెండు మ్యాచ్‌లలో తలో 3 వికెట్లు తీసుకున్నాడు.

ప్రపంచ స్థాయి పేస్‌తో పాటు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను కూడా కనబరిచిన మయాంక్ యాదవ్ గురించి ఖచ్చితంగా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి ఆటగాడు దొరకడం లక్నో సూపర్ జెయింట్ అదృష్టమేనని ఆయన తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మయాంక్ యాదవ్ టెస్ట్‌కు సిద్ధంగా లేడు..

ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌పై పెద్ద స్థాయిలో రాణించి ఆధిపత్యం చెలాయించడం చాలా ప్రత్యేకమని వాట్సన్ చెప్పాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. మయాంక్ యాదవ్‌కు టెస్ట్‌ల్లో ఛాన్స్ ఇవ్వడంపై వాట్సన్ హెచ్చరించాడు. మయాంక్ ఇంకా అందుకు సిద్ధంగా లేడని తెలిపాడు. అతని శరీరం ఇంకా టెస్ట్‌కు అనుగుణంగా లేదని తెలిపాడు.

‘అయితే, అతను టెస్ట్ క్రికెట్‌లో ఆడటానికి ఇష్టపడొచ్చు. కానీ ఒక ఫాస్ట్ బౌలర్‌గా అది శరీరానికి ఎంత సవాలుగా ఉంటుందో తెలుసుకోవడం, శరీరాన్ని దానికి అనుగుణంగా మార్చుకోవడం, ఆ వేగంతో రోజుకు 15 నుంచి 20 ఓవర్లు బౌలింగ్ చేయడం చాలా ముఖ్యం. ఫ్లాట్ పిచ్, ఒత్తిడిని తట్టుకుని, ఈ సమయంలో అతని శరీరాన్ని ఈ పరిమితికి నెట్టడం అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఈ సమయంలో అతడిని టెస్ట్ క్రికెట్ ఆడేలా చేయడం అస్సలు తెలివైన పని కాదని నేను భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

మయాంక్ యాదవ్ నిరంతరం 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 156.7 kmph వేగంతో ఈ సీజన్‌లో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..