GT vs CSK Qualifier 1 Highlights, IPL 2023: మళ్లీ ఫైనల్‌కు వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్‌పై విజయం
Gujarat Titans vs Chennai Super Kings Qualifier 1 Highlights in Telugu: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 173 పరుగుల టార్గెట్ నిలిచింది.
Gujarat Titans vs Chennai Super Kings, IPL Playoffs Highlights in Telugu: గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ చేధించలేకపోయింది. గిల్ 42, రషీద్ 30 రన్స్‌తో రాణించినా గుజరాత్ 157 పరుగులకే ఆలౌటైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 క్వాలిఫైయర్-1లో గుజరాత్ టైటాన్స్ (GT)పై చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో గుజరాత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ 44 బంతుల్లో 60 పరుగులు, కాన్వే 34 బంతుల్లో 40 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య 64 బంతుల్లో 87 పరుగుల భాగస్వామ్యం ఉంది.
మోహిత్ శర్మ, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్ క్వాలిఫయర్-1లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో ప్రారంభమైంది. లీగ్ చరిత్రలో ప్లే ఆఫ్స్‌లో ఈ రెండు జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఈమేరకు టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. గుజరాత్ తరపున యశ్ దయాల్ స్థానంలో దర్శన్ నల్కండేకి అవకాశం లభించగా, ధోనీ తన టీంను మార్చలేదు.
గుజరాత్‌లో ఇది రెండో సీజన్ మాత్రమే. గతేడాది జట్టు ఛాంపియన్‌గా నిలిచినా చెన్నై గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అయితే CSK ఓవరాల్‌గా 12వ సారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
క్వాలిఫయర్-1లో గెలుపొందిన జట్టు ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. కాగా, ఓడిన జట్టుకు ఫైనల్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడాల్సి ఉంటుంది.
ఇరుజట్ల ప్లేయింగ్ 11..
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: విజయ్ శంకర్, శ్రీకర్ భరత్, సాయి సుదర్శన్, జయంత్ యాదవ్, శివమ్ మావి.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మతీషా పతిరనా, మిచెల్ సాంట్నర్, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్.
LIVE Cricket Score & Updates
-
GT vs CSK Qualifier 1 Live Score: తొలి వికెట్ డౌన్..
3 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ జట్టు 1 వికెట్ నష్టపోయి 22 పరుగులు చేసింది.
-
GT vs CSK Qualifier 1 Live Score: గుజరాత్ టార్గెట్ 173
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 173 పరుగుల టార్గెట్ నిలిచింది.
-
-
GT vs CSK Qualifier 1 Live Score: 5 వికెట్లు డౌన్..
చెన్నై 18 ఓవర్లలో ఐదు వికెట్లకు 148 పరుగులు చేసింది
-
GT vs CSK Qualifier 1 Live Score: 15 ఓవర్లకు చెన్నై..
చెన్నై 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే 40, రాయుడు 4 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రహానే 17, శివమ్ దూబే 1, రితురాజ్ గైక్వాడ్ 60 పరుగులుచేసి అవుటయ్యారు.
-
GT vs CSK Qualifier 1 Live Score: రెండు వికెట్లు డౌన్..
చెన్నై 12 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే 30, రహానే 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.
శివమ్ దూబే 1 పరుగు చేసి పెవిలియన్ చేరాడు. 60 పరుగుల వద్ద రితురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు.
-
-
GT vs CSK Qualifier 1 Live Score: గైక్వాడ్ హాఫ్ సెంచరీ..
గైక్వాడ్ ఈ సీజన్‌లో నాలుగో హాఫ్ సెంచరీ బాదేశాడు. GTపై గైక్వాడ్‌కి ఇది వరుసగా నాలుగో అర్ధశతకం. 36 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు.
-
GT vs CSK Qualifier 1 Live Score: 9 ఓవర్లకు చెన్నై స్కోర్..
చెన్నై 9 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. రితురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వాయ్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది.
-
GT vs CSK Qualifier 1 Live Score: పవర్ చూపించిన చెన్నై ఓపెనర్లు..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తోన్న చెన్నై 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. రితురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వాయ్ క్రీజులో ఉన్నారు.
-
GT vs CSK Qualifier 1 Live Score: చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్:
చెన్నై సూపర్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: మతీషా పతిరనా, మిచెల్ సాంట్నర్, సుభ్రాంశు సేనాపతి, షేక్ రషీద్, ఆకాష్ సింగ్.
-
GT vs CSK Qualifier 1 Live Score: గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్:
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: విజయ్ శంకర్, శ్రీకర్ భరత్, సాయి సుదర్శన్, జయంత్ యాదవ్, శివమ్ మావి.
-
GT vs CSK Qualifier 1 Live Score: గుజరాత్‌లో ఒక మార్పు.. చెన్నైలో నో ఛేంజ్..
గుజరాత్ తరపున యశ్ దయాల్ స్థానంలో దర్శన్ నల్కండేకి అవకాశం లభించగా, ధోనీ తన టీంను మార్చలేదు.
-
GT vs CSK Qualifier 1 Live Score: చెన్నై సూపర్ కింగ్స్
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
-
GT vs CSK Qualifier 1 Live Score: గుజరాత్ టైటాన్స్ జట్టు
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ.
-
GT vs CSK Qualifier 1 Live Score: టాస్ గెలిచిన గుజరాత్..
టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.
-
GT vs CSK Qualifier 1 Live Score: క్వాలిఫైయర్ సమరానికి అంతా రెడీ..
Qualifier 1️⃣ ready ??️#TATAIPL | #Qualifier1 | #GTvCSK pic.twitter.com/GEedrdskaI
— IndianPremierLeague (@IPL) May 23, 2023
-
GT vs CSK Qualifier 1 Live Score: ముఖాముఖి పోరులో గుజరాత్‌దే పైచేయి..
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం మూడు మ్యాచ్‌లు జరిగాయి. మూడుసార్లు గుజరాత్ గెలిచింది. ఈ మ్యాచ్‌లు బ్రబౌర్న్, వాంఖడే, నరేంద్ర మోదీ స్టేడియంలలో జరిగాయి. అదే సమయంలో చెపాక్ స్టేడియంలో ఇరు జట్లు తొలిసారి ముఖాముఖిగా తలపడనున్నాయి.
-
GT vs CSK Qualifier 1 Live Score: గెలిస్తే ఫైనల్‌కు.. ఓడితే మరో ఛాన్స్..
క్వాలిఫయర్-1లో గెలుపొందిన జట్టు ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంటుంది. కాగా, ఓడిన జట్టుకు ఫైనల్‌కు చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2లో తలపడనుంది.
-
GT vs CSK Qualifier 1 Live Score: పవర్ ప్లేలో సత్తా చాటిన గుజరాత్..
పవర్‌ప్లేలో చివరి ఐదు గేమ్‌లను పరిశీలిస్తే.. CSK బౌలర్లు కేవలం 3 వికెట్లు మాత్రమే తీశారు. ఇక గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో 24 వికెట్లు పడగొట్టింది. వీటిలో 15 షమీ దక్కించుకున్నాడు.
-
GT vs CSK Qualifier 1 Live Score: స్పిన్‌ను చీల్చి చెండాడిన శివం దూబే..
ఈ సీజన్‌లో స్పిన్‌కు వ్యతిరేకంగా శివమ్ దూబే 175.93 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అతను స్పిన్నర్లపై కేవలం 3 ఫోర్లు మాత్రమే కొట్టాడు. కానీ సిక్సర్ల విషయానికి వస్తే ఏకంగా 20 బాదేశాడు.
-
GT vs CSK Qualifier 1 Live Score: ఈ సీజన్‌లో చెపాక్ గణాంకాలు..
ఈ సీజన్‌లో చెపాక్‌లో మొత్తం ఏడు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో చెన్నై నాలుగు గెలిచి మూడింటిలో ఓడిపోయింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు మూడుసార్లు, లక్ష్యాన్ని ఛేదించిన జట్టు నాలుగుసార్లు గెలుపొందాయి.
-
GT vs CSK Qualifier 1 Live Score: పిచ్ రిపోర్ట్:
ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ సీజన్‌లోని ప్రారంభ మ్యాచ్‌లలో ఇక్కడ 200 కంటే ఎక్కువ పరుగులు వచ్చాయి. గత కొన్ని మ్యాచ్‌లలో స్కోరింగ్ రేటు తగ్గింది.
-
GT vs CSK Qualifier 1 Live Score: చెన్నై వెదర్ రిపోర్ట్..
వెదర్ రిపోర్ట్: మంగళవారం చెన్నైలో వాతావరణం స్పష్టంగా ఉంటుంది. పగటిపూట చాలా వేడిగా ఉంటుంది. వర్షం పడే అవకాశం లేదు. మంగళవారం ఉష్ణోగ్రత 29 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.
-
GT vs CSK Qualifier 1 Live Score: ‘కీ’ ప్లేయర్లు వీరే..
ఐపీఎల్ 2023 మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఈ ఐదుగురు ఆటగాళ్ల ప్రదర్శనపైనే అందరి చూపు ఉంటుంది. వారెవరో ఇక్కడ క్లిక్ చేసి చూడండి..
-
GT vs CSK Qualifier 1 Live Score: డెత్ ఓవర్లో దుమ్ము రేపిన గుజరాత్ టైటాన్స్..
గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లో డెత్-ఓవర్‌లలో [639 పరుగులు] మూడవ అత్యుత్తమ పరుగులను కలిగి ఉంది. అయితే ఇదే దశలో [23] అతి తక్కువ వికెట్లు కోల్పోయింది. అదే సమయంలో సిక్సర్‌లలో రెండవ [48] స్థానంలో నిలిచింది.
-
GT vs CSK Qualifier 1 Live Score: 12వ సారి ప్లేఆఫ్స్ చేరిన చెన్నై..
గుజరాత్‌లో ఇది రెండో సీజన్ మాత్రమే. గతేడాది జట్టు ఛాంపియన్‌గా నిలిచినా చెన్నై గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అయితే CSK ఓవరాల్‌గా 12వ సారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
-
GT vs CSK Qualifier 1 Live Score: తొలిసారి ప్లేఆఫ్స్‌లో ఢీ కొటంటున్న చెన్నై, గుజరాత్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఈ సీజన్ క్వాలిఫయర్-1లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లీగ్ చరిత్రలో ప్లే ఆఫ్స్‌లో ఈ రెండు జట్లు తొలిసారి తలపడనున్నాయి.
Published On - May 23,2023 3:28 PM