AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuldeep Yadav World Record:రాంచీ వన్డేలో అద్భుత ప్రదర్శన.. షెన్ వార్న్ రికార్డు బ్రేక్ చేసిన భారత స్పిన్నర్

భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ నవంబర్ 30, 2025న రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియం కాంప్లెక్స్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 52వ సెంచరీ, రోహిత్ శర్మ 60వ వన్డే హాఫ్ సెంచరీ సాధించారు.

Kuldeep Yadav World Record:రాంచీ వన్డేలో అద్భుత ప్రదర్శన.. షెన్ వార్న్ రికార్డు బ్రేక్ చేసిన భారత స్పిన్నర్
Kuldeep Yadav
Rakesh
|

Updated on: Dec 01, 2025 | 4:07 PM

Share

Kuldeep Yadav World Record: భారత్, సౌతాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ నవంబర్ 30, 2025న రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియం కాంప్లెక్స్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 52వ సెంచరీ, రోహిత్ శర్మ 60వ వన్డే హాఫ్ సెంచరీ సాధించారు. అయితే ఈ ఇద్దరు దిగ్గజాల ప్రదర్శనతో పాటు, స్టార్ స్పిన్నర్ కులదీప్ యాదవ్ ఒక అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. సౌతాఫ్రికాపై అత్యధిక సార్లు 4 వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచి, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్‎ను కులదీప్ అధిగమించాడు.

రాంచీ వన్డేలో టీమిండియా విజయంలో కులదీప్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో అతని గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. కులదీప్ 10 ఓవర్లలో 6.80 ఎకానమీతో 68 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మొదట టోనీ డి జోర్జీ (39 పరుగులు)ను అవుట్ చేసిన తర్వాత, 34వ ఓవర్‌లో కేవలం మూడు బంతుల తేడాతో మార్కో యాన్సెన్, మాథ్యూ బ్రీట్జ్కేలను పెవిలియన్ చేర్చాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ 6వ వికెట్‌కు 68 బంతుల్లో 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యాన్సెన్ (39 బంతుల్లో 70 పరుగులు), బ్రీట్జ్కే (80 బంతుల్లో 72 పరుగులు)ను అవుట్ చేయడం ద్వారా కులదీప్ మ్యాచ్‌ను మళ్లీ భారత్ వైపు తిప్పాడు.

చివరిగా, ప్రెనెలాన్ సుబ్రాయెన్ వికెట్‌ను కూడా తీసుకుని కులదీప్ తన 4 వికెట్ల కోటాను పూర్తి చేసుకున్నాడు. రాంచీ వన్డేలో 4 వికెట్లు తీయడం ద్వారా కులదీప్ యాదవ్ ఒక అరుదైన ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. కులదీప్ వన్డే మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై 4 వికెట్లు తీయడం ఇది నాల్గవ సారి. అంతకుముందు 2018లో కేప్‌టౌన్, గకేబెరా (గకేర్హా), 2022లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో కూడా ఇదే ప్రదర్శన చేశాడు. సౌతాఫ్రికాపై అత్యధిక సార్లు 4 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన స్పిన్ బౌలర్‌గా కులదీప్ యాదవ్ ప్రపంచ రికార్డును తన పేరు మీద నమోదు చేసుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్, భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ లతో కలిసి కులదీప్‌తో భాగస్వామ్యం చేయబడింది. ఇప్పుడు కులదీప్ వారిద్దరినీ అధిగమించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
ఉచితంగా మీ మొబైల్‌లోనే క్రెడిట్ స్కోర్ చూసుకోండిలా..
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
రోలెక్స్ వాచ్‌పై కొత్త పంచాయితీ!
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే