AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs PBKS: సూపర్‌ ఫీల్డింగ్‌తో బాల్‌ బౌండరీ పోకుండా ఆపిన ఫీల్డర్‌! కానీ, కోహ్లీ ఉండగా నాలుగు రాకుండా ఉంటాయా?

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫిట్‌నెస్‌ను ప్రదర్శించాడు. పడిక్కల్ బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపినప్పటికీ, కోహ్లీ అసాధారణ వేగం కారణంగా నాలుగు పరుగులు లభించాయి. 36 ఏళ్ల వయసులోనూ కోహ్లీ ఫిట్‌నెస్, వేగం అద్భుతమనే చెప్పాలి.

RCB vs PBKS: సూపర్‌ ఫీల్డింగ్‌తో బాల్‌ బౌండరీ పోకుండా ఆపిన ఫీల్డర్‌! కానీ, కోహ్లీ ఉండగా నాలుగు రాకుండా ఉంటాయా?
Virat Kohli
SN Pasha
|

Updated on: Apr 20, 2025 | 6:26 PM

Share

విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌ గురించి, అతను వికెట్ల మధ్య ఎంత క్విక్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 36 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ సూపర్‌ ఫిట్‌నెస్‌తో గ్రౌండ్‌లో అద్భుతంగా 16 ఏళ్ల కుర్రాడిలా కదులుతూ ఉంటాడు. కోహ్లీ క్రీజ్‌లో ఉంటే మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ పరిగెత్తలేక చావాలి అని చాలా మంది క్రికెట్‌ అభిమానులు సరదాగా అంటూ ఉంటారు. తాజాగా ఆ విషయాన్ని మరోసారి నిజం చేసి చూపించాడు కింగ్‌ కోహ్లీ. అసలేం జరిగిందంటే.. ఐపీఎల్‌ 2025లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో ముల్లాన్‌పూర్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్‌ చేస్తోంది. పంజాబ్‌ మెయిన్‌ బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ చివరి బంతికి ఆర్సీబీ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ మిడ్‌ వికెట్‌ దిశగా షాట్‌ కొట్టాడు.

ఆ బాల్‌ ఆపేందుకు ఫీల్డర్‌ పాపం ఎంతో దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి.. చివరి నిమిషంలో బాల్‌ను తన కాలితో బౌండరీ రోప్‌కు తగలకుండా ఆపి, తాను బ్యాలెన్స్‌ ఆపుకోలేక బౌండరీ లైన్‌ దాటి ముందుకు వెళ్లిపోయాడు.. వావ్‌.. అద్భుతంగా బౌలంగరీ సేవ్‌ చేశాడని అంతా అనుకున్నారు. కానీ, వికెట్ల మధ్య పడిక్కల్‌తో కలిసి పరిగెడుతుంది విరాట్‌ కోహ్లీ కదా.. చిరుతలా పరిగెత్తి ఏకంగా నాలుగు పరుగులు లాక్కున్నాడు. సో.. ఫీల్డర్‌ బాల్‌ బౌండరీకి పోకుండా ఆపినా లాభం లేకపోయింది. పాపం.. పడిక్కల్‌ కోహ్లీతో కలిసి పరిగెట్టలేక ఇబ్బంది పడ్డాడు. పడిక్కల్‌తో పాటు మరే బ్యాటర్‌ అక్కడున్న కచ్చితంగా మూడే రన్స్‌ వచ్చేవి. కానీ, కోహ్లీ వేగానికి అక్కడ నాలుగో రన్‌ కూడా వచ్చింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..
దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..
నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ