Virat Kohli : వైభవ్ విధ్వంసానికి విరాట్ సలాం.. మ్యాచ్ తర్వాత స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రన్ మిషన్
Virat Kohli : గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లపై అతను చేసిన దాడికి సాక్షాత్తూ కింగ్ విరాట్ కోహ్లీ కూడా ఫిదా అయిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ ఆ కుర్రాడికి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat Kohli : ఐపీఎల్ 2026 సీజన్‌లో పసికూనలా అడుగుపెట్టి, దిగ్గజ బౌలర్లకే చుక్కలు చూపిస్తున్న 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికి హాట్ టాపిక్‌గా మారాడు. గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లపై అతను చేసిన దాడికి సాక్షాత్తూ కింగ్ విరాట్ కోహ్లీ కూడా ఫిదా అయిపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ ఆ కుర్రాడికి ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గౌహతిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ ఒక అద్భుతానికి వేదికైంది. ఆర్సీబీ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. అనుభవజ్ఞులైన భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌ను పవర్ ప్లేలోనే చీల్చి చెండాడాడు. కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి రాజస్థాన్ విజయాన్ని ఖాయం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ స్వయంగా వైభవ్ దగ్గరకు వెళ్లి అతడిని అభినందించాడు. వైభవ్ తన రాజస్థాన్ రాయల్స్ క్యాప్‌పై విరాట్ ఆటోగ్రాఫ్ కోరగా, కోహ్లీ సంతోషంగా సంతకం చేసి, డియర్ వైభవ్, వెల్ డన్ అని ఒక స్వీట్ మెసేజ్ రాసిచ్చాడు.
ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ తన ఓపెనింగ్ పార్ట్‌నర్ యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టి ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు) కైవసం చేసుకున్నాడు. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనే 200 పరుగులు సాధించిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఆర్సీబీ వంటి పెద్ద జట్లపై కేవలం 14, 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు బాదడం ఇతని ప్రత్యేకత.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 201/8 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ 63 పరుగులతో రాణించగా, చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ (29 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. అయితే, రాజస్థాన్ ఇన్నింగ్స్ మొదలయ్యాక సీన్ మారిపోయింది. వైభవ్ సూర్యవంశీతో కలిసి ధ్రువ్ జురెల్ (81 నాటౌట్) రెండో వికెట్‌కు కేవలం 37 బంతుల్లోనే 108 పరుగులు జోడించారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ మరో 12 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
వైభవ్ కేవలం తన ఆటతోనే కాదు, తన సంస్కారంతో కూడా అందరి మనసు గెలుచుకుంటున్నాడు. గత మ్యాచ్‌ల్లో ఆశిష్ నెహ్రా వంటి సీనియర్ల పాదాలకు నమస్కరించి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ నుంచి ప్రశంసలు అందుకోవడం అతని కెరీర్‌కు ఒక పెద్ద బూస్టింగ్ అని చెప్పవచ్చు. హార్దిక్ పాండ్యా కూడా ఈ కుర్రాడి ఆటను చూసి ఆశ్చర్యపోయి, పదే పదే భుజం తట్టి అభినందించడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
