AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli- Anushka: కోహ్లీ-అనుష్కల కొడుకు పేరు ‘అకాయ్‌’.. దీని అర్థమెంటో తెలుసా? ఆ దేవుడి పేరు వచ్చేలా..

పలువురు సినీ, క్రీడా ప్రముఖులు విరుష్క దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కోహ్లి, అనుష్క తమ కుమారుడికి అకాయ్ అనే పేరు పెట్టారన్న విషయం తెలియగానే చాలామంది నెటిజన్లు యాక్టివ్‌ అయ్యారు. అసలు ఈ పేరుకు అర్థమెంటో తెలుసుకోవడానికి వెంటనే గూగుల్‌ తల్లిని ఆశ్రయించారు. ఈ పేరుకు రెండు అర్థాలు ఉన్నాయి

Virat Kohli- Anushka: కోహ్లీ-అనుష్కల కొడుకు పేరు 'అకాయ్‌'.. దీని అర్థమెంటో తెలుసా? ఆ దేవుడి పేరు వచ్చేలా..
Virat Kohli Family
Basha Shek
|

Updated on: Feb 21, 2024 | 1:44 PM

Share

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క శర్మలు రెండోసారి అమ్మానాన్నలయ్యారు. ఫిబ్రవరి 15 న, భార్య అనుష్క పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా ద్వారా ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నాడు. ‘మా హృదయాలు గొప్ప ఆనందం, ప్రేమతో నిండి ఉన్నాయి. ఫిబ్రవరి 15న మేము మా అబ్బాయి అకాయ్‌ని మా జీవితంలోకి స్వాగతించాం’ అని విరాట్ కోహ్లీ చెప్పాడు. దీంతో పలువురు సినీ, క్రీడా ప్రముఖులు విరుష్క దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కోహ్లి, అనుష్క తమ కుమారుడికి అకాయ్ అనే పేరు పెట్టారన్న విషయం తెలియగానే చాలామంది నెటిజన్లు యాక్టివ్‌ అయ్యారు. అసలు ఈ పేరుకు అర్థమెంటో తెలుసుకోవడానికి వెంటనే గూగుల్‌ తల్లిని ఆశ్రయించారు. ఈ పేరుకు రెండు అర్థాలు ఉన్నాయి. అకాయ్‌ అనేది సంస్కృత పదం. అంటే భౌతిక శక్తికి మించినవాడు అని అర్థం. ఈ పేరు శివుని వేయి నామాలలో ఒకటిగా చెబుతారు. ఇదే పేరు టర్కిష్‌లో కూడా ఉంది. ‘ప్రకాశించే చంద్రుడు’ అని అర్థం వస్తుంది.

విరాట్ కోహ్లీ దంపతులు తమ మొదటి బిడ్డకు వామిక అని పేరు పెట్టారు. ఇది దుర్గాదేవి పేరును సూచిస్తుంది. ఇప్పుడు కుమారుడి కోసం శివుని వేయి నామాల నుంచి అకాయ్ అనే పేరును విరాట్ కోహ్లీ దంపతులు ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. విరాట్ కోహ్లి తన కూతురికి వి (వామిక) అని, తన కొడుకుకి అఅకాయ్‌ (అనుష్క) అని పేరు పెట్టడం విశేషం. అంటే, కూతురు పేరు తండ్రి పేరులోని మొదటి అక్షరాలతో ప్రారంభమైతే, కొడుకు పేరు తల్లి పేరులోని మొదటి అక్షరాలతో మొదలవుతుంది. ప్రస్తుతం తన భార్యతో కలిసి ఉన్న విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌ నుంచి వైదొలిగాడు. అలాగే వచ్చే ఐపీఎల్ ద్వారా మళ్లీ మైదానంలో కనిపించనున్నాడు. అంటే కింగ్ కోహ్లీ రీఎంట్రీ కోసం మార్చి 22 వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

విరాట్ కోహ్లీ ట్వీట్..

జూనియర్ కోహ్లీ వచ్చేశాడోచ్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
నెరవేరిన ఎమ్మెల్యే శపథం.. నాలుగేళ్ల తర్వాత ఏం చేశాడంటే
ఆగ్రాలో కుప్పకూలిన గోడ.. నలుగురికి సీరియస్..!
ఆగ్రాలో కుప్పకూలిన గోడ.. నలుగురికి సీరియస్..!
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
ఆ హీరో నన్ను గుర్తుపెట్టుకుని పిలిచి సినిమాలో అవకాశం ఇచ్చాడు
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
రూ. 200ల జీతం.. ఫ్లైట్ రద్దుతో ఐపీఎల్ ట్రయల్స్ మిస్.. కట్‌చేస్తే
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
తనూజ కోసమే శ్రీముఖి వచ్చిందా.. ? వీడియోతో ఏకిపారేస్తున్న నెటిజన్స
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ట్రాఫిక్‌ చలాన్స్‌ రద్దు.. ఆ ప్రభుత్వం
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
జీవితాన్నే మార్చే మిర్రర్ అవర్.. ఈరోజు స్పెషాలిటీ తెలుసా?
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
పొద్దుపొద్దున్నే ఈ అలవాటు మానుకుంటే మీ ఒంట్లో విషం చేరినట్టే!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!
రూ.1 లక్ష పెట్టుబడితో రూ. 3 లక్షలు.. డిమాండ్ తగ్గని వ్యాపారం!