AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virushkha: జూనియర్ కోహ్లీ వచ్చేశాడోచ్.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క.. పేరేంటో తెలుసా?

Anushka Sharma and Virat Kohli Welcomed Baby Boy: అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ రెండవ సారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ బాలీవుడ్ నటి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన కుమారుడి పేరును కూడా పోస్ట్‌లో వెల్లడించింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. అనుష్క రెండోసారి గర్భం దాల్చిందని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాన్ని ఇద్దరూ ధృవీకరించలేదు. కొంతకాలం క్రితం, దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరి రహస్యాన్ని వెల్లడించాడు.

Virushkha: జూనియర్ కోహ్లీ వచ్చేశాడోచ్.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క.. పేరేంటో తెలుసా?
Anushka Virat Kohli
Venkata Chari
|

Updated on: Feb 20, 2024 | 9:21 PM

Share

Anushka Sharma and Virat Kohli Welcomed Baby Boy: క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ అభిమానులకు ఓ శుభవార్త అందించారు. ఈ జంట వారి రెండవ బిడ్డకు వెల్ కం చెప్పారు. సోషల్ మీడియాలో ఈ శుభవార్తను స్వయంగా ప్రకటించడంతో కొన్నాళ్లుగా వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు. ఈ వార్త తెలియగానే వీరిద్దరికీ సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ రెండవ సారి తల్లిదండ్రులు అయ్యారు. ఈ బాలీవుడ్ నటి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తన కుమారుడి పేరును కూడా పోస్ట్‌లో వెల్లడించింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. అనుష్క రెండోసారి గర్భం దాల్చిందని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయాన్ని ఇద్దరూ ధృవీకరించలేదు. కొంతకాలం క్రితం, దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఒక ఇంటర్వ్యూలో వీరిద్దరి రహస్యాన్ని వెల్లడించాడు. ప్రెగ్నెన్సీ పుకార్లలో నిజంగా నిజం ఉందని అప్పుడు నమ్మారు. అయితే, ఆ తర్వాత ఏబీడీ ఈ వార్త నిజం కాదంటూ ప్రకటించాడు. దీంతో అందరిలో అయోమయం నెలకొంది.

టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న కోహ్లీ..

ఇంగ్లండ్ జట్టుతో జరుగుతోన్న 5 టెస్టుల సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ కారణాల వల్ల సిరీస్ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. కానీ, సరైన రీజన్ మాత్రం వెల్లడించలేదు. ఈ క్రమంలో ఎన్నో పుకార్లు వినిపించాయి. అటు బీసీసీఐ మాత్రం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని అభిమానులకు కోరింది. మొత్తానికి కోహ్లీ టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న రీజన్ ఇప్పటికి జనాలకు తెలిసింది.

అనుష్క శర్మ పోస్ట్‌లో – ‘ఆనందం, ప్రేమతో మా హృదయాలు నిండాయి. ఫిబ్రవరి 15 న, మేం మా అబ్బాయి అకాయ్, వామికా చిన్న సోదరుడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. మీ అందరికీ చెప్పడానికి మేం సంతోషిస్తున్నాం! మా జీవితంలోని ఈ అందమైన దశలో మీ ప్రార్థనలు, శుభాకాంక్షలను మేం కోరుకుంటున్నాం. దయచేసి ఈ సమయంలో మా గోప్యతను గౌరవించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’ అంటూ రాసుకొచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
టీమిండియా ప్లేయింగ్ XI ఫిక్స్.. 2 ఏళ్ల తర్వాత తోపు రీఎంట్రీ
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి తయారీకి సూపర్‌ ట్రిక్‌.. ఇలా చేశారంటే..
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
మొన్నటి వరకు స్టార్ హీరోయిన్..ఇప్పుడు IPS ఆఫీసర్
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లల్లో కొత్త రూల్స్.. ఆ టికెట్లు ఉండవ
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
మేడారం మహా జాతరకు బస్ ఛార్జీలు ఖరారు.. ఇలా చేస్తే ఇంటికే ‘బంగారం’
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
4 కారణాల వల్లే కోటాను కోట్లు పోగొట్టుకున్నా..!
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
కాళ్లకు సాక్స్‌ వేసుకుని నిద్రపోతే ఇన్ని లాభాలా..? నిపుణుల సూచన
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు..