IND vs AUS: వన్డే ప్రపంచకప్‌లో అత్యంత స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. లిస్టులో కేఎల్ రాహుల్ ఎక్కడంటే?

ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ 2023 ప్రపంచ కప్‌లో అత్యంత నెమ్మదైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు.

IND vs AUS: వన్డే ప్రపంచకప్‌లో అత్యంత  స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. లిస్టులో కేఎల్ రాహుల్ ఎక్కడంటే?
Kl Rahul

Updated on: Nov 19, 2023 | 5:37 PM

ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ 2023 ప్రపంచ కప్‌లో అత్యంత నెమ్మదైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు.

అంతకుముందు, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 81 బంతుల్లో ఫిఫ్టీ చేయడం ప్రపంచ కప్ 2023లో అత్యంత స్లో లిస్టులో టాప్ ప్లేస్‌లో నిలిచింది.

ఇవి కూడా చదవండి

11వ ఓవర్‌లో టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులతో ఉన్న సమయంలో వచ్చిన రాహుల్ 86 బంతుల్లో ఇన్నింగ్స్ రీ బిల్డ్ చేస్తూ హాఫ్ సెంచరీ నమోదు చేసి, భారత్‌ను మూడో ప్రపంచకప్ టైటిల్ వేటలో నిలిచేలా చేశాడు. అయితే, 66 పరుగుల వద్ద కేఎల్ పెవిలియన్ చేరాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ జోష్ ఇంగ్లిస్ చేతికి చిక్కాడు. ఈ ప్రపంచకప్‌లో రాహుల్ రెండో అర్ధశతకం సాధించాడు.

అయితే, కేఎల్ రాహుల్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడంపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడినా చివరి దాకా క్రీజులో నిలవలేకపోవడంతో టీమిండియా తక్కువ స్కోర్‌కే నమోదైంది.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..