AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul: ఒకే జట్టులో రోహిత్, రాహుల్.. మెగా ఆక్షన్‌లోకి విధ్వంసకర ఓపెనర్.. ఇక బౌలర్ల ఊచకోతే.!

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు బీసీసీఐ మెగా ఆక్షన్‌ నిర్వహించనుంది. ఈ నేపధ్యంలోనే కెఎల్ రాహుల్‌ పంజాబ్‌ కింగ్స్‌కు గుడ్‌బై..

KL Rahul: ఒకే జట్టులో రోహిత్, రాహుల్.. మెగా ఆక్షన్‌లోకి విధ్వంసకర ఓపెనర్.. ఇక బౌలర్ల ఊచకోతే.!
Kl Rahul
Ravi Kiran
|

Updated on: Oct 30, 2021 | 10:13 AM

Share

వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు బీసీసీఐ మెగా ఆక్షన్‌ నిర్వహించనుంది. ఇప్పటికే రూల్స్ కూడా ప్రకటించడంతో మెగా ఆక్షన్‌కు ముందు ఫ్రాంచైజీలు తమతో కేవలం 4(3 భారత్ ప్లేయర్స్, లేదా 2 విదేశీ) ఆటగాళ్లను మాత్రమే అట్టే పెట్టుకోగలవు. ఈ క్రమంలోనే చాలామంది భారత ఆటగాళ్ళతో పాటు విదేశీ ప్లేయర్స్ సైతం మెగా ఆక్షన్‌లోకి రానున్నారు. శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్.. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్.. ఇలా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎందరో ఉన్నారు. క్రికెట్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చేలా ఐపీఎల్ 2022 మొత్తం మారబోతోంది.

ఇదిలా ఉంటే.. మెగా ఆక్షన్‌కు ముందు కెఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ జట్టులో చేరతాడన్న ఆసక్తి అందరిలో ఉండగా.. ఇందుకు సంబంధించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే ఐపీఎల్ సీజన్‌కు రాహుల్‌ ముంబై ఇండియన్స్‌ జట్టులో చేరనున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌ క్రిక్ బజ్ తమ సర్వేలో వెల్లడైనట్లు తెలిపింది. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో 13 మ్యాచ్‌ల‌లో రాహుల్ 626 ప‌రుగులు చేశాడు. ఇతర బ్యాట్స్‌మెన్ల సహకారం లేకపోయినా.. ఎన్నో మ్యాచ్‌లు పంజాబ్‌కు కెఎల్ రాహుల్ ఒంటిచేత్తో విజయాలను అందించాడు.

అయితే బ్యాట్స్‌మ‌న్‌గా అద్బుతంగా రాణిస్తున్నప్పటికి.. కెప్టెన్‌గా ఆ జట్టుకు టైటిల్‌ అందించకపోవడంపై రాహుల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు సోషల్‌ మీడియాలో టాక్‌ నడుస్తోంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఆ జట్టు వదులుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?