Asia Cup 2023: టీమిండియాకు శుభవార్త.. ఆసియా కప్‌కు అందుబాటులో స్టార్‌ ప్లేయర్‌.. మిడిలార్డర్‌ మరింత బలోపేతం

|

Aug 04, 2023 | 9:13 PM

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు శుభవార్త. గాయం కారణంగా కొన్ని నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తిరిగి జట్టులోకి రానున్నాడు. 31 ఏళ్ల ఈ స్టార్ రైట్ హ్యాండ్ బ్యాటర్‌ ఆసియా కప్‌తో పాటు ప్రపంచ కప్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఈ రెండు ప్రతిష్ఠాత్మక టోర్నీలకు కీపర్‌ అండ్‌ బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌ ఫస్ట్‌ ఛాయిసేనని తెలుస్తోంది.

Asia Cup 2023: టీమిండియాకు శుభవార్త.. ఆసియా కప్‌కు అందుబాటులో స్టార్‌ ప్లేయర్‌.. మిడిలార్డర్‌ మరింత బలోపేతం
Team India
Follow us on

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు శుభవార్త. గాయం కారణంగా కొన్ని నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్న స్టార్ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తిరిగి జట్టులోకి రానున్నాడు. 31 ఏళ్ల ఈ స్టార్ రైట్ హ్యాండ్ బ్యాటర్‌ ఆసియా కప్‌తో పాటు ప్రపంచ కప్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఈ రెండు ప్రతిష్ఠాత్మక టోర్నీలకు కీపర్‌ అండ్‌ బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌ ఫస్ట్‌ ఛాయిసేనని తెలుస్తోంది. కాగా మే 1న లక్నోలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డాడు రాహుల్‌. ఆతర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అయితే ఇప్పుడీ కర్ణాటక బ్యాటర్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడట. దీంతో జట్టు ఎంపికకు కూడా అందుబాటులో ఉన్నాడు. ఈ ఏడాది ఆసియా కప్‌లోనే కేఎల్ రాహుల్ టీమ్ ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆగస్టు 30న ముల్తాన్‌లో పాకిస్థాన్ వర్సెస్‌ నేపాల్ మధ్య మ్యాచ్‌తో ఆసియా కప్ 2023 ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరగనుంది. సెప్టెంబర్ 2న కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.

కాగా కేఎల్ రాహుల్ టీమ్ ఇండియాలోకి పునరాగమనం చేయడం జట్టుకు చాలా ఊరటనిస్తుంది. వికెట్ కీపర్ అండ్‌ బ్యాటర్‌ రిషబ్ పంత్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌ శ్రేయాస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు రాహుల్ రీఎంట్రీ జట్టులో మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడమే కాకుండా వికెట్ కీపింగ్ కూడా చేయనున్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోన్న రాహుల్.. కోచ్‌లు, వైద్య నిపుణుల సలహా మేరకు బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. అలాగే రాహుల్ స్వయంగా తన ప్రాక్టీస్‌ సెషన్‌ వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్‌ చేసుకుంటున్నాడు. రాహుల్ టీమ్ ఇండియా తరఫున మొత్తం 54 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. 45.13 సగటుతో మొత్తం 1986 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..