AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KL Rahul: తప్పు చేసిన కేఎల్‌ రాహుల్‌.. అప్పటి నుంచి మాట్లాడం మానేసిన తల్లి! ఆ తప్పేంటంటే..?

కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో రాణిస్తున్నాడు. కానీ అతని జీవితంలో ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. 15 ఏళ్ల వయసులో, తల్లిదండ్రులకు చెప్పకుండా, తనకు ఇష్టమైన ఫుట్ బాల్ ఆటగాడు డేవిడ్ బెక్హామ్ ప్రేరేపణతో టాటూ వేయించుకున్నాడు. దీనితో అతని తల్లి అతనితో మాట్లాడటం మానేసింది.

KL Rahul: తప్పు చేసిన కేఎల్‌ రాహుల్‌.. అప్పటి నుంచి మాట్లాడం మానేసిన తల్లి! ఆ తప్పేంటంటే..?
Kl Rahul
SN Pasha
|

Updated on: Apr 18, 2025 | 12:54 PM

Share

కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో బీజీగా ఉన్నాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిట్స్‌ తరఫున ఆడుతూ అద్భుత ప్రదర్శన కనబరస్తున్నాడు. కాగా, ఇవాళ(ఏప్రిల్‌ 18) రాహుల్‌ బర్త్‌ డే. ఈ సంరద్భంగా రాహుల్‌ జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకుందాం.. ఆ సంఘటనతో రాహుల్‌ తల్లి అతనితో మాట్లాడం మానేసిందంట. అంత పెద్ద తప్పు రాహుల్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం.. కేఎల్‌ రాహుల్‌ అప్పుడే క్రికెట్‌లో ఓనమాలు నేర్చుకుంటున్నాడు. అప్పుడు రాహుల్‌కు కేవలం 15 సంవత్సరాల మాత్రమే. రాహుల్ కు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. అతను అన్ని రకాల ఆటలు ఆడేవాడు.

రాహుల్ తండ్రి కేఎన్ లోకేష్, తల్లి రాజేశ్వరి ఇద్దరూ విద్యావంతులు. తండ్రి సునీల్ గవాస్కర్ కి పెద్ద అభిమాని కావడంతో కేఎల్‌ రాహుల్‌ క్రికెటర్‌ అవుతానంటే ఓకే అన్నారు. కానీ, ఒక షరతుపై ఒప్పుకున్నారు. క్రికెట్‌ పిచ్చిలో పడి చదవును నిర్లక్ష్యం చేయొద్దని రాహుల్‌ నుంచి మాట తీసుకున్నారు. అలాగే తల్లి నుంచి కూడా ఒక షరతు చదువు గ్రాఫ్ పడిపోతే.. క్రికెట్‌ ఆడటం మానేయాలి. వీటికి రాహుల్‌ అంగీకరించి క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అయితే.. కేఎల్‌ రాహుల్‌కి.. టీమిండియా మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంటే చాలా ఇష్టం. అతనే అతని రోల్‌ మోడల్‌. అలాగే రాహుల్‌ ద్రవిడ్‌కు స్టైల్ ఐకాన్ ఇంగ్లాండ్ గొప్ప ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్‌హామ్ అంటే అభిమానం.

రాహుల్‌కు కూడా బెక్‌హామ్‌ అంటే పిచ్చి ఇష్టం. చిన్నతనం నుంచే స్టైల్‌గా ఉండటం రాహుల్‌కు ఇష్టం. ఆ ఇష్టంతోనే బెక్‌హామ్‌కు సంబంధించిన టాటూలు చేతిపై వేయించుకున్నాడు. ఇదే రాహుల్‌ తల్లికి కోపం తెప్పించింది. అంతే.. అప్పటి నుంచి రాహుల్‌తో ఆమె మాట్లాడటం మానేసింది. 15 సంవత్సరాల వయసులో తన శరీరంపై ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రాహుల్‌ టాటూలు వేయించుకున్నాడు. ఈ ఘటన తర్వాత కొంతకాలం పాటు ఆమె తల్లి రాహల్‌తో మాట్లాడటం మానేసింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..