KKR vs RR: నిన్నటి మ్యాచ్‌లో ఇది గమనించారా? ఛీ.. ఛీ.. స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్ మరిచి ఇలా చేయాలా?
గౌహతిలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచింది. క్వింటన్ డికాక్ 97 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు, కానీ జోఫ్రా ఆర్చర్ వరుసగా రెండు వైడ్ బంతులు వేయడం వలన సెంచరీ చేయలేకపోయాడు. ఆర్చర్ చర్యలపై క్రికెట్ అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. బుధవారం అస్సాంలోని గౌహతిలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలిచింది. గౌహతి ఆర్‌ఆర్ సెకండ్ హోం గ్రౌండ్‌గా ఉంది. కాగా మ్యాచ్‌లో జరిగిన ఓ సంఘటన క్రికెట్ అభిమానులకు కోపం తెప్పించింది. ఏకంగా ఓ ప్లేయర్‌ను షేమ్‌లెస్ క్రికెటర్ అంటూ క్రికెట్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఇంతకీ అసలు నిన్నటి మ్యాచ్‌లో ఏం జరిగింది? ఫ్యాన్స్ ఎవరిని ఎందుకు తిడుతున్నారు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఐపీఎల్ 2025లో భాగంగా బుధవారం ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 152 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేస్తూ.. కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డికాక్.. 97 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.
61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సులతో 97 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. డికాక్‌తో కలిసి రఘువంశీ 17 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే.. జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో డికాక్ తొలి రెండు బంతుల్లో ఫోర్, సిక్స్ బాదాడు. దీంతో అతని వ్యక్తిగత స్కోర్ 91 పరుగులకు చేరుకుంది. కేకేఆర్ విజయానికి మరో 7 పరుగులు కావాలి. ఓ ఫోర్, ఓ సిక్స్ బాది డికాక్ సెంచరీ చేస్తాడని, చేయాలని చాలా మంది క్రికెట్ అభిమానులు అనుకున్నారు. కానీ, ఇక్కడ ఆర్చర్ తన అసలు స్వరూపం బయటపెట్టాడు. వరుసగా రెండు వైడ్లు వేశాడు.
అప్పుడు కేకేఆర్ విజయానికి కేవలం 5 పరుగులు మాత్రమే అవసరం అయ్యాయి. ఆ తర్వాత బంతికి డికాక్ సిక్స్ కొట్టడంతో కేకేఆర్ విజయం సాధించింది. కానీ, డికాక్ 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, తన సెంచరీని పూర్తి చేసుకోలేకపోయాడు. ఆర్చర్ ఆ రెండు వైడ్లు వేయకుండా ఉండుంటే.. డికాక్‌కు సెంచరీ చేసేకునేందుకు ఒక అవకాశం ఉండేది. కానీ, డికాక్ సెంచరీని అడ్డుకోవడం కోసమే ఆర్చర్ ఉద్దేశపూర్వకంగా వైడ్లు వేశాడంటూ మ్యాచ్ తర్వాత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. స్పోర్ట్స్‌మెన్ స్పిరిట్‌ను మర్చిపోయి.. కావాలనే వైడ్లు వేయడం సిగ్గుచేటు అంటూ ఘటూ విమర్శలు చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.