IPL 2025: డేంజరస్ ప్లేయర్‌ను రిలీజ్ చేసిన కేకేఆర్.. కట్‌చేస్తే.. 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో షాకింగ్ సెంచరీ..

రహ్మానుల్లా గుర్బాజ్ తన వన్డే కెరీర్‌లో ఎనిమిదో సెంచరీ చేయడం ద్వారా చాలా ప్రత్యేకమైన జాబితాలో చోటు సంపాదించాడు. అతను ఇప్పుడు క్వింటన్ డి కాక్, సచిన్ టెండూల్కర్‌ల ప్రత్యేక జాబితాలో భాగమయ్యాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు 23 సంవత్సరాల కంటే ముందు వన్డేలలో ఒక్కొక్కరు 8 సెంచరీలు సాధించారు. ఇప్పుడు గుర్బాజ్ అలాంటి ఫీట్ చేశాడు.

IPL 2025: డేంజరస్ ప్లేయర్‌ను రిలీజ్ చేసిన కేకేఆర్.. కట్‌చేస్తే.. 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో షాకింగ్ సెంచరీ..
Rahmanullah Gurbaz Kkr

Updated on: Nov 12, 2024 | 1:26 PM

షార్జాలో జరిగిన మూడో వన్డేలో ఆఫ్ఘనిస్థాన్ 5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ విజయానికి హీరోగా వికెట్ కీపర్ కం బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ నిలిచాడు. తన సెంచరీతో కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేయగా, 245 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి సాధించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా, మహ్మద్‌ నబీ (135 పరుగులు, 2 వికెట్లు) ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా నిలిచాడు.

మ్యాచ్ వివరాలు..

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే, ఆ జట్టు పరిస్థితి మరింత దిగజారింది. 4 వికెట్లకే 72లు కోల్పోయింది. ఇక్కడి నుంచి అనుభవజ్ఞులైన మహ్మదుల్లా, మెహదీ హసన్ మిరాజ్ జోడీ ఆధిక్యం సాధించి ఐదో వికెట్‌కు 145 పరుగులు జోడించి జట్టు స్కోరును 200 దాటించారు. మిరాజ్ 66 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, మహ్మదుల్లా 98 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్‌ తరపున అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా 100 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత రహ్మానుల్లా గుర్బాజ్, అజ్మతుల్లా ఒమర్జాయ్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టును పటిష్ట స్థితిలో ఉంచారు. గుర్బాజ్ తన కెరీర్‌లో ఎనిమిదో ODI సెంచరీని సాధించాడు. అవుట్ కావడానికి ముందు, 120 బంతుల్లో 101 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఏడు అద్భుతమైన సిక్సర్లు కూడా ఉన్నాయి. అతను ఔట్ అయినప్పటికీ, ఒమర్జాయ్ ఒక ఎండ్ నుంచి పరుగులు చేయడం కొనసాగించాడు. 70 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయపథంలో నడిపించాడు. మహ్మద్ నబీ కూడా 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..