Ayodhya Ram Mandir: జై శ్రీరామ్ అంటోన్న దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్.. అయోధ్య రామమందిరంపై వీడియో రిలీజ్
భారత దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ రామనాపం ప్రతిధ్వినిస్తోంది. ఈనేపథ్యంలో దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ ఆల్‌రౌండర్ కేశవ్ మహరాజ్ తన రామ భక్తిని చాటుకున్నాడు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడీ స్టార్ ఆల్ రౌండర్.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంతో దేశమంతా పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని మోడీ, సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు రామ మందిర ప్రారంభోత్సవాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం భారత దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ రామనాపం ప్రతిధ్వినిస్తోంది. ఈనేపథ్యంలో దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ ఆల్‌రౌండర్ కేశవ్ మహరాజ్ తన రామ భక్తిని చాటుకున్నాడు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడీ స్టార్ ఆల్ రౌండర్. దక్షిణాఫ్రికా టాప్ స్పిన్నర్ గా గుర్తింపు పొందిన కేశవ్ మహారాజ్ హనుమాన్ భక్తుడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో కూడా రాసుకున్నాడు. రీసెంట్‌గా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో మహరాజ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు రామ్ సియా రామ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను అమితంగా ఆరాధించే కేశవ్ మహరాజ్ తరచూ ఇండియాలోని దేవాలయాలను సందర్శిస్తుంటాడు. ఈ నేపథ్యంలో మరోసారి తన రామ భక్తిని చాటుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను పంచుకున్నాడీ స్టార్ ఆల్ రౌండర్. అందులో ‘దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయులందరూ రామమందిరాన్ని ప్రారంభోత్సవంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతిచోటా శాంతి, సద్భావన, ఆధ్యాత్మిక చైతన్యం రావాలి. జై శ్రీరామ్’ అంటూ వీడియో ముగించాడు మహరాజ్. ప్రస్తుతం ఈవీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇక రామమందిర ప్రాణ ప్రతిష్టకు పలువురు క్రికెటర్లను ఆహ్వానించారు. ఇందులో సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. ఇందులో కోహ్లీ అయోధ్య చేరుకున్నట్లు సమాచారం. విరాట్ కాన్వాయ్ అయోధ్యలోకి ప్రవేశించిన వీడియో వైరల్‌గా మారింది. క్రికెటర్లతో పాటు వెయిట్ లిఫ్టర్ కర్ణం మల్లీశ్వరి, ఫుట్‌బాల్ క్రీడాకారిణి కళ్యాణ్ చౌబే, స్ప్రింటర్ కవితా రౌత్, పారాలింపిక్ జావెలిన్ త్రోయర్ దేవేంద్ర ఝజారియాలకు కూడా ఆహ్వానాలు పంపారు. మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, వారి కోచ్ పుల్లెల గోపీచంద్‌లకు కూడా ఆహ్వానం అందింది.
శుభాకాంక్షలు తెలిపిన కేశవ్ మహారాజ్..
Looking forward to the opening of the Ram Mandir in Ayodhya. May it bring peace and enlightenment to one and all. 🙏 @MaheshIFS pic.twitter.com/P8TGT8tteX
— Keshav Maharaj (@keshavmaharaj16) January 21, 2024
కేరళ పద్మనాభస్వామి ఆలయంలో దక్షిణాఫ్రికా క్రికెటర్..
South African cricketer keshav Maharaj sought blessings from Sree Padmanabhaswamy Temple at Thiruvananthapuram. His forefathers left India in 1874. He still proudly wears his identity in his sleeves. #Sreepadmanabhaswamytemple #Kerala #Navaratri2022 #Navratri #शारदीय_नवरात्रि pic.twitter.com/A4Q2AYwxFf
— Tarun Singh Verma 🇮🇳 (@TarunSinghVerm1) September 26, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..