Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: ఛీ..ఛీ.. ఇదేం పాడుపని.. క్రికెట్ కోచింగ్ ముగుసులో బాలికలపై కన్నేశాడు.. చివరకు..

Kerala Cricket Coach Arrested: కేరళ క్రికెట్ అసోసియేషన్ మాజీ క్రికెట్ కోచ్ శిక్షణా సెషన్లలో మహిళా ఆటగాళ్లను లైంగికంగా వేధించాడని ఆరోపిణలు ఎదుర్కొన్నాడు. దీంతో పోలీసులు తిరువనంతపురంలో అరెస్టు చేశారు. కోచ్‌గా తన పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేసి క్రికెట్ కోచింగ్ ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మనుపై ఆరోపణలు ఉన్నాయి.

Cricket: ఛీ..ఛీ.. ఇదేం పాడుపని.. క్రికెట్ కోచింగ్ ముగుసులో బాలికలపై కన్నేశాడు.. చివరకు..
Kca Coach Manu
Follow us
Venkata Chari

|

Updated on: Jul 06, 2024 | 1:01 PM

Kerala Cricket Coach Arrested: కేరళ క్రికెట్ అసోసియేషన్ మాజీ క్రికెట్ కోచ్ శిక్షణా సెషన్లలో మహిళా ఆటగాళ్లను లైంగికంగా వేధించాడని ఆరోపిణలు ఎదుర్కొన్నాడు. దీంతో పోలీసులు తిరువనంతపురంలో అరెస్టు చేశారు. కోచ్‌గా తన పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేసి క్రికెట్ కోచింగ్ ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మనుపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల కథనం ప్రకారం, మను తన స్టూడెంట్లను లైంగికంగా వాడుకునేందుకు తెంకాసిలో శిక్షణా తరగతులను ఉపయోగించుకున్నాడు. ఆరోపణల ప్రకారం, అతను రహస్యంగా బట్టలు లేకుండా మైనర్ బాలికల ఫొటోలు తీసుకునేవాడంట. క్రికెట్ ఎంపిక కోసం వారి శరీరాలను పరీక్షించాలంటూ, వేధింపులకు పాల్పడేవాడంట.

పోక్సో చట్టం కింద అరెస్ట్..

KCA పింక్ టోర్నమెంట్ సమయంలో విచారణ ప్రారంభించిన తర్వాత.. ఒక బాధితురాలు ముందుకు వచ్చి ఫిర్యాదు నమోదు చేసింది. అప్పటి నుంచి మరో ఐదుగురు బాధితులు మనుపై ఆరోపణలు చేశారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం కింద తిరువనంతపురం కంటోన్మెంట్ పోలీసులు వెంటనే కేసులు నమోదు చేశారు. మూలాల ప్రకారం, మను ఒక దశాబ్దానికి పైగా తిరువనంతపురంలో క్రికెట్ కోచ్‌గా ఉన్నారు. అతను ఇంతకు ముందు అరెస్టయ్యాడు. వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించబడ్డాడు. కానీ, తరువాత ఫిర్యాదుదారు తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకున్నాడు. దీంతో అతను నిర్దోషిగా తేలాడు. అయినా తీరు మారలేదు.

జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏమన్నారంటే?

ఇటీవల అరెస్టు చేసిన తర్వాత అధికారులు మను రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు ఇవే. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రజిత్ రాజేంద్రన్ మాతృభూమి న్యూస్‌తో మాట్లాడుతూ.. మనుపై ఫిర్యాదు చేసిన బాలికలకు జిల్లా క్రికెట్ అసోసియేషన్ పూర్తి మద్దతు ఇస్తుంది.

ఆయన మాట్లాడుతూ, “మనుపై గతంలో ఒక కేసు నమోదైంది. అందులో ఫిర్యాదుదారు తన వాంగ్మూలాన్ని మార్చడంతో అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. ఆ సందర్భంలో, పిల్లలందరినీ విచారించారు. కానీ, పిల్లలందరూ మనుకి మద్దతు ఇచ్చారు. తెన్కాసి టోర్నమెంట్, పిల్లలు, వారి తల్లిదండ్రులు, వారి కోచ్‌లు సంయుక్తంగా తెన్కాసి టోర్నమెంట్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..