టీమిండియా, ఐపీఎల్ నుంచి ఔట్.. 21 ఫోర్లు, 12 సిక్సులతో 283 పరుగులు.. 3 ఏళ్ల తర్వాత అదిరిపోయే ఇన్నింగ్స్..

Kedar Jadhav: రంజీ ట్రోఫీలో అస్సాంపై కేదార్ జాదవ్ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. అయితే, రెండోసారి ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కొద్దిలో కోల్పోయాడు.

టీమిండియా, ఐపీఎల్ నుంచి ఔట్.. 21 ఫోర్లు, 12 సిక్సులతో 283 పరుగులు.. 3 ఏళ్ల తర్వాత అదిరిపోయే ఇన్నింగ్స్..
Kedar Jadav

Updated on: Jan 05, 2023 | 9:15 PM

Ranji Trophy: కేదార్ జాదవ్.. ఈ పేరు భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడో మర్చిపోయి ఉంటారు. అలాగే ఈ ప్లేయర్‌ను టీమిండియాతో పాటు ఐపీఎల్ జట్లు కూడా నమ్మకం కోల్పోయాయి. కానీ, ఇప్పుడు ఈ ఆటగాడు తిరిగి వచ్చాడు. అయితే, రీ ఎంట్రీలో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడడంతో అంతా ఆశ్చర్యపోయారు. కేదార్ జాదవ్ రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో తుఫాను శైలిలో 283 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. డీవై పాటిల్ అకాడమీ మైదానంలో అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో జాదవ్ ఈ డబుల్ సెంచరీ కొట్టాడు.

జాదవ్ కేవలం 283 బంతుల్లో 283 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 100గా నిలిచింది. జాదవ్ తన తుఫాను ఇన్నింగ్స్‌లో 12 సిక్స్‌లు, 21 ఫోర్లు కొట్టాడు. జాదవ్ క్రీజులోకి వచ్చేసరికి మహారాష్ట్ర 95 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అస్సాం బౌలర్ల దాడిని దాటిగా అడ్డుకున్నాడు.

అద్భుతమైన పునరాగమనం..

మూడేళ్ల విరామం తర్వాత కేదార్ జాదవ్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. తన మొదటి రీఎంట్రీ మ్యాచ్‌లో, ఈ ఆటగాడు డబుల్ సెంచరీ కొట్టిన ఘనత సాధించాడు. కేదార్ 207 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. 258 బంతుల్లో 250 పరుగులు చేశాడు. ఈ ఆటగాడు తన ట్రిపుల్ సెంచరీని కోల్పోయాడు. కేదార్ జాదవ్ ట్రిపుల్ సెంచరీ చేసి ఉంటే, అది అతని ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో రెండో ట్రిపుల్ సెంచరీ అయి ఉండేది. జాదవ్ అత్యధిక స్కోరు 327 పరుగులు.

ఇవి కూడా చదవండి

టీమ్ ఇండియా, ఐపీఎల్ నుంచి ఔట్..

మహారాష్ట్రకు చెందిన ఈ తుఫాను బ్యాట్స్‌మెన్ గత 3 సంవత్సరాలుగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. జాదవ్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఫిబ్రవరి 2020లో ఆడాడు. పేలవమైన ఫామ్ కారణంగా అతడు టీమ్ ఇండియా నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్‌లో ఈ ఆటగాడి బ్యాట్ పనిచేయకపోవడంతో 2022లో జాదవ్‌కు ఒక్క మ్యాచ్‌ ఆడలేదు. 2023 ఐపీఎల్ వేలంలో జాదవ్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..