India vs Sri Lanka, 2nd T20: రెండో టీ20లో శ్రీలంకతో పోరాడి ఓడిన టీమిండియా
శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ పోరాడి ఓడింది. దీంతో భారత్‌పై శ్రీలంక విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవి చూసింది. శ్రీలంక నిర్ధేశించిన 207..
శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ పోరాడి ఓడింది. దీంతో భారత్‌పై శ్రీలంక విజయం సాధించింది. 16 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవి చూసింది. శ్రీలంక నిర్ధేశించిన 207 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్.. 8 విఎట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది. అక్షర్ పటేల్ (65; 31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (51; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించినా జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయారు. ఈ విజయంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ లంక 1-1 తేడాతో సమం చేసింది. ఇక శ్రీలంక బౌలర్లలో మధుశంక, రజిత, శనక తలో రెండు వికెట్లు పడగొట్టగా.. చమీకా కరుణరత్నె, వానిందు హసరంగ చెరో వికెట్ పడగొట్టారు. సిరీస్ నిర్ణయాత్మక పోరు శనివారం రాజ్‌కోట్‌లో జరగనుంది.
ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న లంక భారత్ బౌలర్ల వైఫల్యంతో దూకుడు వ్యవహరించింది. దీంతో లంక భారీ స్కో్‌ర్ చేసింది. అయితే నిర్ణిత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్ షనక( 22 బంతుల్లో 56 నాటౌట్), మెరుపులు మెరిపించగా.. కుషాల్ మెండిస్ 52, అసలంక 37 పరుగులు చేశారు. ఇక మ్యాచ్‌లో విజయంతో లంక మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇక ఇరుజట్ల మధ్య కీలకమైన చివరి టి20 మ్యాచ్ జనవరి 7వ తేదీన రాజ్‌కోట్ వేదికగా జరగనుంది.
మరిన్ని స్పోర్స్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి