AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hockey World Cup 2023: హాకీ క్రీడాకారులకు బంఫర్ ఆఫర్.. ప్రపంచకప్ గెలిస్తే ప్రతీ ప్లేయర్‌కు రూ.కోటి..

హాకీ ప్రపంచకప్‌నకు ముందు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కీలక ప్రకటన చేశారు. భారత జట్టు ప్రపంచకప్ గెలిస్తే ఆటగాళ్లందరికీ కోటి రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు.

Hockey World Cup 2023: హాకీ క్రీడాకారులకు బంఫర్ ఆఫర్.. ప్రపంచకప్ గెలిస్తే ప్రతీ ప్లేయర్‌కు రూ.కోటి..
Hockey World Cup 2023 Odisha CM Naveen Patnaik
Venkata Chari
|

Updated on: Jan 05, 2023 | 9:34 PM

Share

Hockey World Cup 2023: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాకీ ప్రపంచ కప్ 2023 గురించి కీలక ప్రకటన చేశారు. భారత హాకీ జట్టును ప్రమోట్ చేసినందుకు భారీ రివార్డును ప్రకటించారు. 2023 ఎఫ్‌ఐహెచ్ వరల్డ్ కప్‌కు ముందు, భారత హాకీ జట్టు ఈసారి ప్రపంచకప్ గెలిస్తే, జట్టులోని ప్రతి క్రీడాకారుడికి గౌరవంగా కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. రూర్కెలాలోని బిర్సా ముండా హాకీ స్టేడియం కాంప్లెక్స్‌లో వరల్డ్ కప్ విలేజ్‌ను ప్రారంభిస్తున్న సందర్భంగా నవీన్ పట్నాయక్ ఈ ప్రకటన చేశారు.

రికార్డు సమయంలో వరల్డ్ కప్ గ్రామం సిద్ధం..

ఈ ప్రపంచకప్ గ్రామాన్ని తొమ్మిది నెలల రికార్డు సమయంలో నిర్మించారు. హాకీ ప్రపంచకప్ స్థాయికి తగినట్లుగా అన్ని సౌకర్యాలతో కూడిన 225 గదులు ఇందులో ఉన్నాయి. ప్రపంచ కప్ గ్రామం రాబోయే హాకీ ప్రపంచ కప్ జట్లు, అధికారులకు నిలయంగా ఉంటుంది. ఈ సందర్భంగా ప్రపంచకప్ గ్రామంలో ఏర్పాటు చేసిన జాతీయ పురుషుల హాకీ జట్టుతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. క్రీడాకారులు ఒడిశా ప్రభుత్వాన్ని ప్రశంసించారు. హాకీ కోసం పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి చేసిన హార్డ్ వర్క్‌కు ధన్యవాదాలు తెలిపారు.

భారత్‌లో వరుసగా రెండోసారి ప్రపంచకప్‌..

ఈ ఏడాది భారత్‌లో వరుసగా రెండోసారి హాకీ ప్రపంచకప్‌ జరగనుంది. ప్రపంచకప్‌లో ఇది 15వ ఎడిషన్‌. ఈసారి ప్రపంచకప్ మొత్తం ఒడిశాలోని రెండు స్టేడియాల్లో జరగనుంది. ఇందులో భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, రూర్కెలాలోని బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియం ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

విశేషమేమిటంటే ఈసారి ప్రపంచకప్ జనవరి 13 నుంచి జనవరి 29 వరకు జరగనుంది. ఇందులో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. హాకీ ప్రపంచకప్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆడుతుంటారు. మొదటి ఎడిషన్ 51 సంవత్సరాల క్రితం 1971లో నిర్వహించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..