AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కోటి రూపాయలతో కొన్నావు సరే.. టీమిండియా పాలిట విలన్‌‌లా మార్చేస్తే ఎలా కావ్యా పాప..

Kavya Maran SRH Team Player Brydon Carse: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్‌ ఆటగాడు బ్రైడన్‌ కార్సే అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ ఆటగాడు మొదట బ్యాట్‌తో, తర్వాత బంతితో విధ్వంసం సృష్టించాడు. ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా, SRH కావ్య మారన్ కూడా ఆనందంలో మునిగిపోయింది.

Video: కోటి రూపాయలతో కొన్నావు సరే.. టీమిండియా పాలిట విలన్‌‌లా మార్చేస్తే ఎలా కావ్యా పాప..
Kavya Maran Srh Team Player
Venkata Chari
|

Updated on: Jan 26, 2025 | 4:17 PM

Share

Kavya Maran SRH Team Player Brydon Carse: చెన్నై వేదికగా ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. వరుసగా రెండో టీ-20లో ఇంగ్లండ్‌ను ఓడించి అభిమానుల హృదయాలను గెలుచుకుంది టీమిండియా. అయితే, చెన్నై టీ20లో కూడా ఓ ఇంగ్లండ్ ఆటగాడు అద్భుత ప్రదర్శన చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యజమాని కావ్య మారన్ కూడా అతని ఆటతీరు పట్ల సంతోషం వ్యక్తం చేసింది. వాస్తవానికి, ఈ ఆటగాడిని ఐపీఎల్ 2025 కోసం రూ. 1 కోటికి కొనుగోలు చేసింది. కానీ, ఈ ఆటగాడు భారత్‌పై రూ.5 కోట్ల ఫీట్ సాధించాడు.

బ్రైడెన్ కార్స్ ఆల్ రౌండ్ ప్రదర్శన..

చెన్నై వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయాన్ని నమోదు చేసి అభిమానులను ఆనందపరిచింది. భారత ఆటగాళ్ల నుంచి అద్భుత ప్రదర్శన కనిపించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌కు చెందిన 29 ఏళ్ల ఆటగాడు బ్రైడెన్ కార్సే కూడా ఆధిపత్యం చెలాయించాడు. ముందుగా తన బ్యాట్ తో గందరగోళం సృష్టించాడు. ఆ తర్వాత, అతను బంతిని పట్టుకుని విధ్వంసం స‌ృష్టించాడు.

ఐపీఎల్‌కు ముందే రెచ్చిపోతోన్న కావ్య మారన్ ప్లేయర్..

బ్రైడన్ కర్స్ ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా టీమిండియా గెలవడానికి కష్టపడాల్సి వచ్చింది. కానీ, కావ్య మారన్ IPL కోణం నుంచి చూస్తే బ్రైడెన్ కార్స్ కొనుగోలు సరైనదని నిరూపితమైంది. SRH IPL 2025 వేలంలో బ్రైడెన్ కార్స్‌ను రూ. 1 కోటికి కొనుగోలు చేసింది. కానీ, అతని ఆటతీరు చూశాక దాదాపు రూ.5 కోట్ల విలువైన ఆటగాడితో సమానంగా నిలిచాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. టీమ్ ఇండియాతో జరగబోయే మ్యాచ్‌లతోపాటు ఐపీఎల్ 2025లో బ్రైడన్ ఎలాంటి అద్భుతాలు చేస్తాడోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..