గత 15 ఏళ్లలో అతనే గ్రేటెస్ట్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్! కేన్ మామ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
గత 15 ఏళ్లలో చూసిన గొప్ప ఆల్-ఫార్మాట్ ఆటగాడిగా ఓ భారత క్రికెటర్ ను కేన్ విలియమ్సన్ అభినందించాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్ 1 ర్యాంక్‌లో ఉన్న ఏకైక ఆటగాడు కోహ్లీ అని కేన్ ప్రశంసించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్.. తెలుగు క్రికెట్ అభిమానులు కేన్ మామ అని ముద్దుగా పిలుచుకునే క్రికెటర్‌కు ఇండియాలో ఎంత మంది క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాదరహితుడిగా, హృదయం ముక్కలయ్యే ఓటమి ఎదురైనా ముఖంపై చిరునవ్వును చెదరనివ్వని ప్లేయర్‌గా కేన్ మామను చాలా మంది ఇష్టపడతారు. ఇక ఐపీఎల్‌లో మన హోం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన సమయంలో, కెప్టెన్‌గా ఉన్న టైమ్‌లో అతన్ని తెలుగు క్రికెట్ అభిమానులు మరింత ఓన్ చేసుకున్నారు. అలాంటి ప్లేయర్.. తాజాగా ఓ టీమిండియా దిగ్గజ ఆటగాడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గత 15 ఏళ్లుగా మనం చూసిన గ్రేటెస్ట్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అతనే అని పేర్కొన్నాడు. ఇంతకీ కేన్ మామ మాట్లాడింది ఎవరి గురించో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ కింగ్ విరాట్ కోహ్లీ గురించి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఫ్యాబ్ ఫోర్‌గా పిలువబడే క్రికెటర్లలో విరాట్ కోహ్లీతో పాటు కేన్ విలియమ్సన్ కూడా ఉంటాడు. వీరిద్దరితో పాటు ఇంగ్లాండ్ సీనియర్ ప్లేయర్ జో రూట్, ఆస్ట్రేలియా సీనియర్ క్రికెటర్ స్మిత్ ఉంటారు. వీరి నలుగురిని క్రికెట్ లోకం ఫ్యాబ్ ఫోర్ అని ప్రస్తావిస్తూ ఉంటుంది. అయితే ఈ నలుగురిలో టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీనే రిటైర్ అయ్యాడు. నలుగురిలో కూడా నంబర్ వన్ ప్లేస్‌లో ఉండే కోహ్లీ.. మిగతా వారి కంటే ముందే టెస్ట్ ఫార్మాట్‌ను వదిలేయడంతో క్రికెట్ అభిమానులతో పాటు ఫ్యాబ్ ఫోర్‌లోని మిగతా ముగ్గురు కూడా షాక్ అయ్యారు.
అయితే తాజాగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ కేన్ విలియమ్సన్ పై విధంగా పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్లలోనూ ప్రపంచ నంబర్ ర్యాంకింగ్‌లో కొనసాగిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. కుటుంబంతో ఉండాలని, తన వ్యక్తిగత జీవితం కోసం రిటైర్మెంట్ ప్రకటించాడని.. గత 15 ఏళ్ల కాలంలో నేను చూసిన గ్రేటెస్ట్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అతనే అంటూ కేన్ మామ కోహ్లీని ప్రశంసించాడు. కాగా కేన్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
KANE WILLIAMSON ON VIRAT KOHLI 🐐
“Probably the greatest all-format player we’ve seen for the last 15 years”. [Sky Sports] pic.twitter.com/i0VpWSf1RH
— Johns. (@CricCrazyJohns) July 12, 2025
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




