కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విలియంసన్!

ప్రపంచక్‌పలో లక్ష్య ఛేదన ఏమాత్రం సులువుకాదు. అలాంటి ఛేజింగ్‌లలో కెప్టెన్‌ అజేయ సెంచరీతో జట్టును విజయపథాన నిలపడం మామూలు విషయం కాదు. గత బుధవారం సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సెంచరీతో రాణించాడు. ఓ దశలో మ్యాచ్‌ సఫారీలవైపు మొగ్గినట్టు కనిపించినా.. ఏ మాత్రం ఒత్తిడికిలోనవ్వకుండా విలియమ్సన్‌ కడదాకా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ప్రపంచ క్రికెట్‌లో తనను అత్యుత్తమ సారథిగా ఎందుకు పరిగణిస్తున్నారో తెలియజెప్పాడు. చివరి ఐదు బంతుల్లో ఏడు రన్స్‌ […]

కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విలియంసన్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 23, 2019 | 4:53 PM

ప్రపంచక్‌పలో లక్ష్య ఛేదన ఏమాత్రం సులువుకాదు. అలాంటి ఛేజింగ్‌లలో కెప్టెన్‌ అజేయ సెంచరీతో జట్టును విజయపథాన నిలపడం మామూలు విషయం కాదు. గత బుధవారం సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సెంచరీతో రాణించాడు. ఓ దశలో మ్యాచ్‌ సఫారీలవైపు మొగ్గినట్టు కనిపించినా.. ఏ మాత్రం ఒత్తిడికిలోనవ్వకుండా విలియమ్సన్‌ కడదాకా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ప్రపంచ క్రికెట్‌లో తనను అత్యుత్తమ సారథిగా ఎందుకు పరిగణిస్తున్నారో తెలియజెప్పాడు. చివరి ఐదు బంతుల్లో ఏడు రన్స్‌ కావాల్సిన తరుణంలో పెహ్లూక్వాయో బౌలింగ్‌లో క్లాసీ సిక్స్‌, ఫోర్‌తో మ్యాచ్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు కేన్‌. వరల్డ్‌‌కప్‌లలో ఇప్పటివరకు ఐదుగురు కెప్టెన్లే చేజింగ్‌లలో అజేయ సెంచరీలు కొట్టి జట్లకు విజయాలు అందించారు. వారిలో ముగ్గురు న్యూజిలాండ్‌ సారథులే ఉండడం విశేషం.