యార్కర్ వేయమని ధోని చెప్పాడు- షమీ

వరల్డ్ కప్ 2019: భారత్, అఫ్గనిస్తాన్‌ల మధ్య  ఉత్కంఠభరిత పోరులో ఇండియా ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ గెలుపులో లాస్ట్ ఓవర్ బౌల్ చేసిన షమీ కీలక భూమిక పోషించాడు. అంతేకాదు భారత్ తరుపున వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. చివరి ఓవర్లో సూపర్ ఫామ్ లో కనిపిస్తోన్న అఫ్గన్ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ నబీ(52)ని కట్టడి చేయాలని కెప్టెన్ కోహ్లీ.. బౌలింగ్‌ను షమీకి అప్పగించాడు. తొలి బంతిని ఫోర్ […]

యార్కర్ వేయమని ధోని చెప్పాడు- షమీ
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 23, 2019 | 6:02 PM

వరల్డ్ కప్ 2019: భారత్, అఫ్గనిస్తాన్‌ల మధ్య  ఉత్కంఠభరిత పోరులో ఇండియా ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ గెలుపులో లాస్ట్ ఓవర్ బౌల్ చేసిన షమీ కీలక భూమిక పోషించాడు. అంతేకాదు భారత్ తరుపున వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు.

చివరి ఓవర్లో సూపర్ ఫామ్ లో కనిపిస్తోన్న అఫ్గన్ బ్యాట్స్‌మెన్ మొహమ్మద్ నబీ(52)ని కట్టడి చేయాలని కెప్టెన్ కోహ్లీ.. బౌలింగ్‌ను షమీకి అప్పగించాడు. తొలి బంతిని ఫోర్ బౌండరీకి తరలించిన నబీ.. లక్ష్యాన్ని త్వరగా చేధించాలని కుతూహలంగా ఉన్నాడు. అంతేకాదు నబీ బాడీ లాంగ్వేజ్‌లో బెరుకు ఏ మాత్రం లేదు. దానిని గమనించిన ధోనీ.. బౌలర్ షమీ దగ్గరకొచ్చి వ్యూహాన్ని చెప్పి వెళ్లిపోయాడు. అంతే ఆ తర్వాత బాల్ డాట్ వేసిన షమీ..తర్వాత బంతుల్లో వరుసగా మూడు వికెట్లు తీశాడు.

దీనిపై మ్యాచ్ అనంతరం స్పందించిన షమీ… ‘సింపుల్ ప్లాన్.. ఒకే ఒక్క ఆప్షన్ యార్కర్ వేయాలి. మహీ భాయ్.. అదే చెప్పాడు. ప్లాన్ ఏం మార్చొద్దు…అదే యార్కర్ సంధించమని చెప్పాడు. ఇలాంటి సందర్భాలు అరుదుగా వస్తాయి. నేను హ్యాట్రిక్ సాధించడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది’ అని టీమిండియా ఫేసర్ మొహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు.