ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌..అతనే టాప్..కోహ్లీ ఎన్నో స్థానంలో ఉన్నాడో తెలుసా?

|

Oct 16, 2024 | 7:06 PM

ఇంగ్లాండ్‌ క్రికెటర్ జో రూట్ ICC టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ నెం.1 ప్లేయర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ టెస్ట్‌లలో జో రూట్ డబుల్ సెంచరీ చేయడంతో 932 పాయింట్లను సాధించాడు. ఈ మ్యాచ్ అద్భుతు ప్రతిభ కనబరుచడంతో జో రూట్ గతంతో పోలిస్తే తొమ్మిది పాయింట్లు ఎక్కువ సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీతో సహా కేవలం పదహారు మంది ఆటగాళ్లు మాత్రమే టెస్టు క్రికెట్ చరిత్రలో 932 కంటే ఎక్కువ రేటింగ్ పాయింట్‌ను సాధించడం గమనార్హం.

ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌..అతనే టాప్..కోహ్లీ ఎన్నో స్థానంలో ఉన్నాడో తెలుసా?
Icc Test Batting Ranking List
Follow us on

ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ బ్యాటర్ జో రూట్ ICC టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 20లోకి దూసుకొచ్చాడు. పాకిస్తాన్ టెస్ట్‌లలో జో రూట్ డబుల్ సెంచరీ చేయడంతో 932 పాయింట్లను సాధించాడు. ఈ ఇంగ్లండ్‌ ప్లేయర్ గతంతో పోలిస్తే తొమ్మిది పాయింట్లు ఎక్కువ సంపాదించాడు. భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీతో సహా కేవలం పదహారు మంది ఆటగాళ్లు మాత్రమే టెస్టు క్రికెట్ చరిత్రలో 932 కంటే ఎక్కువ రేటింగ్ పాయింట్‌ను సాధించడం గమనార్హం.

ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మొదటి టెస్ట్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీని ద్వారా జో రూట్ ఆదరగొట్టాడు. మూడవ స్థానంలో వచ్చిన జో రూట్ కేవలం 375 బంతుల్లో 262 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ వారి మొదటి ఇన్నింగ్స్‌లో 823 పరుగుల రికార్డు బద్దలు కొట్టడానికి దోహదపడింది. పాకిస్థాన్‌తో జరుగుతున్న సిరీస్‌లోని మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సంచలనాత్మక ట్రిపుల్ సెంచరీ చేసిన హ్యారీ బ్రూక్ తాజా ICC పురుషుల టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి ఐదు స్థానాలోకి వచ్చాడు. అక్టోబర్ 1, 2024 నాటి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానం ఉన్నా హ్యారీ బ్రూక్ తాజాగా మూడొవ స్థానానికి వచ్చాడు. టీమిండియా క్రికెటర్లు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ రిషబ్ పంత్‌లను అధిగమించాడు.

ఐసీసీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ఇలా ఉన్నాయి:

1..జో రూట్

2..కేన్ విలియమ్సన్

3..హ్యారీ బ్రూక్

4..యశస్వి జైస్వాల్

5..స్టీవెన్ స్మిత్

6..ఉస్మాన్ ఖవాజా

7..విరాట్ కోహ్లీ

8..మార్నస్ లాబుస్‌చగ్నే

9..రిషబ్ పంత్

10..డారిల్ మిచెల్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి