
ఐపీఎల్‌లో క్రికెటర్ల ఫోర్లు, సిక్సులు ఎంత పాపులరో.. కావ్య మారన్ ఎక్స్‌ప్రెషన్స్, ప్రీతి జింటా హగ్గులు కూడా అంతే ఫేమస్. మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను పంజాబ్ కో ఓవన్ ప్రీతి జింటా సరదాగా హగ్ చేసుకొని, వారిని అభినందిస్తూ ఉంటారు. అవి సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంటాయి. ఇటీవలె యుజ్వేంద్ర చాహల్ కేకేఆర్‌తో జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఏకంగా 4 వికెట్లు పడగొట్టి, పంజాబ్ విక్టరీలో కీలక పాత్ర పోషించినందుకు చాహల్‌కు ప్రీతి ఒక హగ్ ఇచ్చింది. దాన్ని కూడా నెటిజన్లు వైరల్ చేసేశాడు.
తాజాగా ఆర్సీబీ ఆటగాడు జితేష్ శర్మ కూడా ప్రీతి హగ్ కోసం పరిగెత్తుకొచ్చాడు. అతన్ని పంజాబ్ ప్లేయర్ ఆపే ప్రయత్నం చేసినా.. అతని వైపు కోపంగా చూసి.. వెంటనే ప్రీతి జింటాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమెను ఎంతో ఆత్మియంగా హత్తుకున్నాడు. గతంలో జితేష్ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఈ సీన్స్ చూసి.. కొంతమంది క్రికెటర్లు జితేష్‌ను ఇమిటేట్ చేస్తూ ఆట పట్టించారు. ఎంతైనా ఒకనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను హగ్ చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు చెప్పండి. పైగా ఆమె ఎంతో ఆప్యాయంగా పిలిచి మరీ అలా ప్రేమగా హగ్ చేసుకుంటే మ్యాచ్ కంటే ఆ సీన్లే హైలెట్‌గా ఉంటున్నాయి.
The hug Moment of Preity Zinta and Jitesh Sharma after the Match yesterday. ❤️
— Tanuj (@ImTanujSingh) April 19, 2025
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..