AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్.. షాకైన డికాక్..

Jitesh Sharma pulls off MS Dhoni: డికాక్ 90 పరుగుల వద్ద అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడి 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.

Video: ధోనిని తలపించిన జితేష్ శర్మ.. కళ్లుమూసి తెరిచేలోపే స్టంపింగ్.. షాకైన డికాక్..
Ind Vs Sa Jitesh Sharma
Venkata Chari
|

Updated on: Dec 12, 2025 | 9:09 AM

Share

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ జితేష్ శర్మ చేసిన ఒక అద్భుతమైన రనౌట్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని గుర్తుచేసేలా జితేష్ చేసిన మెరుపు ఫీల్డింగ్ కారణంగా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తన సెంచరీని పూర్తి చేసుకోలేకపోయాడు.

ముల్లన్‌పూర్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 46 బంతుల్లోనే 90 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో 16వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో డికాక్ బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. బంతి బ్యాట్ అంచుకు తాకి కీపర్ వైపు వెళ్లింది. ఆ సమయంలో డికాక్ తెలియకుండానే క్రీజు బయటకు వచ్చాడు.

ఇవి కూడా చదవండి

వెంటనే అప్రమత్తమైన జితేష్ శర్మ, బంతిని అందుకున్న మరుక్షణం మెరుపు వేగంతో వికెట్లను గిరాటేశాడు. క్రీజులోకి డికాక్ బ్యాట్ పెట్టకముందే బెయిల్స్ పడిపోవడంతో అంపైర్ అవుట్ ప్రకటించాడు. జితేష్ చూపించిన ఈ సమయస్ఫూర్తి అచ్చం ధోనిని తలపించిందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

మ్యాచ్ ఫలితం..

డికాక్ 90 పరుగుల వద్ద అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 213 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడి 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ..
ప్రధాని మోదీ ఇష్టంగా తినే మునగాకు పరాటా.. రోజూ ఒక్కటి తింటే ..
సార్.. మీరేంటిలా ? ఈ టాలీవుడ్ యాక్షన్ హీరోను గుర్తు పట్టారా?
సార్.. మీరేంటిలా ? ఈ టాలీవుడ్ యాక్షన్ హీరోను గుర్తు పట్టారా?
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
బెంగాల్, అస్సాంలలో ముఖ్యమంత్రి ఎవరు..?
'ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు'..: మాజీ క్రికెటర్
'ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 5 కోట్లు అడిగారు'..: మాజీ క్రికెటర్
రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయమని కోరుకున్నా: సుప్రిత
రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయమని కోరుకున్నా: సుప్రిత
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆగిన రిజిస్ట్రేషన్‌లు.. ఎందుకంటే?
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆగిన రిజిస్ట్రేషన్‌లు.. ఎందుకంటే?
పదో తరగతి అర్హతతో భారత వైమానిక దళంలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా
పదో తరగతి అర్హతతో భారత వైమానిక దళంలో ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా
కోలీవుడ్‌లో మారుతున్న సీన్‌.. టాలీవుడ్ హీరోలు పాగా వేస్తారా..?
కోలీవుడ్‌లో మారుతున్న సీన్‌.. టాలీవుడ్ హీరోలు పాగా వేస్తారా..?
ప్రామిసరీ నోటులో ఈ తప్పులు చేస్తే.. ఇక మీ డబ్బులు..
ప్రామిసరీ నోటులో ఈ తప్పులు చేస్తే.. ఇక మీ డబ్బులు..