AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

jasprit bumrah: బిగ్ అప్‌డేట్.. ఆ కీలక కప్‌కు బుమ్రా దూరం..? కారణం ఇదే..!

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌కు ముందు బీసీసీఐ బుమ్రాను జట్టు నుంచి రిలీజ్ చేసింది. పనిభారంతో అతడికి రెస్ట్ ఇచ్చింది. అయితే.. 2025 ఆసియా కప్‌లో అతడు ఆడతాడా..? లేదా..? అన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వైరల్‌గా మారింది.

jasprit bumrah: బిగ్ అప్‌డేట్.. ఆ కీలక కప్‌కు బుమ్రా దూరం..? కారణం ఇదే..!
Jasprit Bumrah Asia Cup
Krishna S
|

Updated on: Aug 02, 2025 | 10:06 PM

Share

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బుమ్రా కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయితే అతడిని సెలక్ట్ చేసినప్పుడే బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. బుమ్రా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని చెప్పింది. అందుకు తగ్గట్లుగా తొలి టెస్ట్ ఆడిన బుమ్రా.. రెండో టెస్టుకు రెస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత మూడు, నాలుగు టెస్టులు వరుసగా ఆడాడు. ఇక కీలకమైన ఐదో టెస్టులో ఆడుతాడని అంతా అనుకున్నారు. కానీ అతడికి రెస్ట్ ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో కీలక మ్యాచ్‌లో బుమ్రా లేకుండా టీమిండియా ఆడుతోంది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను తక్కువ రన్స్కే కట్టడి చేయడం గమనార్హం. ఈ క్రమంలో బుమ్రా గురించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. రాబోయే ఆసియా కప్‌లో ఆడటం లేదని సమాచారం.

జస్ప్రీత్ బుమ్రా 2025 ఆసియా కప్‌లో ఆడడని తెలుస్తోంది. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుండి ప్రారంభం కానుంది. నివేదిక ప్రకారం.. జస్ప్రీత్ బుమ్రా ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాడా లేదా అనేదానిపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. దీనికి సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 29న జరుగుతుంది. ఆ తర్వాత టీమిండియా అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 6 వరకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. బుమ్రా ఆసియా కప్ ఆడితే.. అతను వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

బుమ్రా ఆసియా కప్‌లో ఆడితే.. అతనికి ఒక నెల విశ్రాంతి ఇవ్వబడుతుంది. ఆ తర్వాత, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బుమ్రా తిరిగి జట్టులో చేరతారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే బుమ్రాను ఏ టోర్నమెంట్‌లో ఆడించాలో అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బుమ్రా.. మూడు మ్యాచ్‌లు ఆడి 26 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఆసియా కప్ 2025లో జస్‌ప్రీత్ బుమ్రా గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేది సస్పెన్స్‌గా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..