టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కలేదు.. కట్ చేస్తే.. 7 సిక్సర్లు, 5 ఫోర్లతో సెంచరీ చేశాడు..
యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ తాజాగా అద్భుతమైన సెంచరీతో కదంతొక్కాడు. ప్రస్తుతం దేశవాళీ టోర్నీ..
టీ20 వరల్డ్‌కప్‌కు టీమ్‌ఇండియాలో చోటు దక్కకపోవడంతో చాలామంది యువ ఆటగాళ్లు నిరాశలో ఉన్నారు. వారిలో కొందరు డొమెస్టిక్ క్రికెట్‌లో అదరగొడుతున్నారు. ఈ కోవలోనే యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ తాజాగా అద్భుతమైన సెంచరీతో కదంతొక్కాడు. ప్రస్తుతం దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ జరుగుతోంది. ఇందులో ఇషాన్ కిషన్ జార్ఖండ్ తరఫున ఆడుతున్నాడు.
గురువారం ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ సాధించాడు. కేవలం 64 బంతుల్లోనే 7 సిక్సర్లు, 5 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌తో జార్ఖండ్ 188 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఫలితంగా ఒడిశా జట్టు లక్ష్యచేధనలో కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో ఈ మ్యాచ్‌లో జార్ఖండ్ 71 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరోవైపు ఇషాన్ కిషన్.. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 93 పరుగులు చేసిన విషయం విదితమే.