AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni : మెడలో కత్తి, చేతిలో గన్..యాక్షన్ హీరోగా కొత్త అవతారమెత్తిన ఎంఎస్ ధోనీ..టీజర్ అదిరిపోయింది

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆదివారం మళ్లీ వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో ధోనీకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ధోనీ కమాండో యూనిఫాంలో, చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్నాడు. ఈ వీడియోలో నటుడు ఆర్. మాధవన్ కూడా కనిపిస్తున్నాడు. ఇది ప్రముఖ దర్శకుడు వాసన్ బాలా కొత్త ప్రాజెక్ట్ టీజర్ అని తెలుస్తోంది.

MS Dhoni : మెడలో కత్తి, చేతిలో గన్..యాక్షన్ హీరోగా కొత్త అవతారమెత్తిన ఎంఎస్ ధోనీ..టీజర్ అదిరిపోయింది
Ms Dhoni
Rakesh
|

Updated on: Sep 07, 2025 | 7:45 PM

Share

MS Dhoni : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆదివారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారాడు. ధోనీ యాక్షన్ మోడ్‌లో ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోనీతో పాటు సీనియర్ హీరో ఆర్. మాధవన్ కూడా ఉన్నారు. ఈ వీడియో ప్రముఖ దర్శకుడు వాసన్ బాలా కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన టీజర్. ఇందులో ధోనీ తుపాకీతో కాల్పులు జరుపుతుండటం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

యాక్షన్ హీరోగా ధోనీ

నటుడు ఆర్. మాధవన్ ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో మహేంద్ర సింగ్ ధోనీ ఒక టాస్క్ ఫోర్స్ ఆఫీసర్‌గా కనిపించారు. అతను కమాండో యూనిఫాంలో, కళ్లపై నల్ల కళ్లద్దాలతో, శత్రువులపై కాల్పులు జరుపుతూ కనిపించాడు. మాధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో టీజర్ విడుదల చేస్తూ.. “ఒక మిషన్. ఇద్దరు ధైర్యవంతులు. రెడీగా ఉండండి, ఒక యాక్షన్ ఛేజ్ ప్రారంభం కానుంది” అని రాశారు.

ఈ టీజర్‌ను వాసన్ బాలా డైరెక్ట్ చేశారు. అయితే, ఇది సినిమానా, వెబ్ సిరీసా లేదా ఒక హై-ప్రొఫైల్ యాడ్ అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ధోనీ, మాధవన్ ఇద్దరూ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ పాత్రలో కనిపించారు. వీడియోలో ధోనీని ది కూల్ హెడ్ గా, మాధవన్‌ను మనసుతో ఆలోచించే రొమాంటిక్ ఆఫీసర్‌గా చూపించారు. ఈ వీడియో విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిసింది.

అభిమానుల ఉత్సాహం

అభిమానులు “మా ధోనీ ఇప్పుడు హీరో అయిపోయాడా? అని కామెంట్ చేశారు. మరొక యూజర్ మైదానంలో ధోనీ ఒక ఫినిషర్, ఇప్పుడు తెరపై యాక్షన్ హీరో అని రాశారు. ఇంకొకరు ఫస్ట్ డే ఫస్ట్ షో మాది అని అన్నారు. గతంలో ధోనీ తమిళ సినిమా గోట్‎లో ఒక చిన్న పాత్రలో కనిపించాడు. కానీ, ఇంత పెద్ద పాత్రలో కనిపించడం ఇదే మొదటిసారి. ఇది సినిమా అయితే పెద్ద హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ధోనీ మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. కానీ అతని దూకుడు శైలి అందరికీ తెలిసిందే. తక్కువ డైలాగులు, ఎక్కువ యాక్షన్ తో తెరపై కూడా అదే ధోనీ స్టైల్ కనిపించింది.

కొనసాగుతున్న సస్పెన్స్ 

ప్రస్తుతం టీజర్ చివరిలో కేవలం కమింగ్ సూన్ అని మాత్రమే రాసి ఉంది. దీంతో ఇది సినిమానా లేక సిరీసా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అంతకుముందు ఏప్రిల్‌లో, ప్రముఖ సినీ నిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ధోనీ ఒక వీడియోను షేర్ చేశారు. అందులో ధోనీని లవర్ బాయ్ అని అభివర్ణించారు. ఆ వీడియో గులాబీ రంగు స్క్రీన్, చిన్న హృదయాలతో ప్రారంభమై.. మొదటిసారి, రొమాంటిక్ స్టైల్‌లో ఎం.ఎస్. ధోనీ అని రాసి ఉంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..